విజయవాడ

రాజధాని అమరావతిలో ఉండటమే న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 13: రాజధాని అమరావతిలోనే ఉండాలని చేసే పోరాటంలో న్యాయముందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి అన్నారు. గాంధీనగర్‌లోని ధర్నాచౌక్‌లో ‘సేవ్ అమరావతి.. సేవ్ ఆంధ్రప్రదేశ్’ పేరుతో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నాలో సోమవారం వాకింగ్, రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈసందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ అమరావతిలో నిర్మించిన భవనాల్లో నుంచే చంద్రబాబు, ఇప్పుడు జగన్ కూడా పాలన సాగిస్తున్నారని చెప్పారు. అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ కూడా మద్దతిచ్చారని గుర్తుచేశారు. ఇప్పటికే రూ. 9,500 కోట్లు అమరావతిలో ఖర్చు చేశారని, ఇది కేంద్రం ఇచ్చినా, రాష్ట్రం ఖర్చుచేసినా అది ప్రజాధనం అనే విషయం విస్మరించరాదన్నారు. 2019కి జగన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రూ. 500కోట్లు అమరావతి అభివృద్ధికి కేటాయించారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అమరావతి సమానదూరంలో ఉందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలేకాని పాలన వికేంద్రీకరణ కాదని తులసిరెడ్డి స్పష్టం చేశారు. ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ వైకాపా నాయకులే పెయిడ్ ఆర్టిస్ట్‌లని ఎద్దేవా చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి, పార్థసారథి తమ ప్రాంతాలను అభివృద్ధి చేయవద్దని కోరుతూ ర్యాలీలు చేస్తున్నారని, ఈ పరిస్థితులు రాష్ట్రంలో ఎక్కడా లేవన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి మెప్పు కోసం ర్యాలీలు చేస్తున్న వైకాపా నాయకులే పెయిడ్ ఆర్టిస్ట్‌లని ధ్వజమెత్తారు. జగన్‌కు ముఖ్యమంత్రిగా ఒకసారి అవకాశమిస్తే ఆరు నెలల్లోనే రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. చంద్రబాబు కంటే జగన్ తెలివైనవాడని, కానీ ఆ తెలివిని మంచికి కాకుండా చెడుకు ఉపయోగిస్తున్నారని నాని అన్నారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు మాట్లాడుతూ అమరావతినే రాజధానిగా ఉండాలనే ఉద్యమం ఇప్పుడు రాష్టవ్య్రాప్తం అయిందన్నారు. వైజాగ్‌లో రాజధాని పెట్టేది వైజాగ్‌పై ప్రేమతో కాదని, విజయమ్మను ఓడించిన వైజాగ్‌పై పగతీర్చుకునేందుకేనని అన్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ మాట్లాడుతూ అమరావతి రాజధాని కావాలంటూ మహిళలు ఆందోళనలు చేస్తుంటే పోలీసులు అమానుషంగా దాడి చేయడం సరికాదన్నారు. రాజధాని ఎందుకు తరలిస్తున్నారో ప్రజలకు తెలియజేసి వారి అనుమతితోనే తరలింపు ప్రక్రియ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. జాతీయ వాకర్స్ అసోసియేషన్ నాయకుడు తొండెపు హనుమంతరావు మాట్లాడుతూ రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ జేఏసీ చేసే ఆందోళన కార్యక్రమాల్లో వాకర్స్ అందరూ పాల్గొనాల్సిందిగా కోరారు. కార్యక్రమంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ జిల్లా కన్వీనర్ ఆర్వీ స్వామి, గద్దె రాజలింగం, యలమంచిలి అంజలి, కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ, జనసేన వీర మహిళా విభాగం నాయకురాలు యు ఉదయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం ధర్నాచౌక్ నుంచి సీఆర్డీఏ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అధికారులకు వినతిపత్రం అందజేశారు.