విజయవాడ

నేడు పల్స్‌పోలియో ఆదివారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 18: అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి ఐదేళ్ల వయస్సు కలిగిన పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందించే పోలియో చుక్కల మందు ఆదివారం వేయనున్నారు. ప్రతి ఏటా జనవరి మూడో ఆదివారం జాతీయ స్థాయిలో దేశవ్యాప్తంగా ఒకేరోజు జరిగే ఈ కార్యక్రమానికి నగరంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. వీఎంసీ హెల్త్, జిల్లా ఆరోగ్య శాఖాధికారుల సంయుక్త పర్యవేక్షణలో పల్స్‌పోలియో కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిచేశారు. నగరంలో నూరు శాతం పిల్లలకు చుక్కల మందు వేయించాలన్న లక్ష్యంతో కార్యాచరణ రూపొందించారు. నగరంలో లక్షా 47వేల 485మంది చిన్నారులను గుర్తించిన వీఎంసీ అధికారులు 378 కేంద్రాలతో పాటు బస్టాండ్, రైల్వే స్టేషన్, దుర్గగుడి, జన సాంద్రత ఎక్కువగా ఉండే కూడళ్లలో మొత్తం 30 ప్రత్యేక పోలీయో కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలలో పనిచేసేందుకు 1862 మంది సిబ్బంది, పర్యవేక్షించేందుకు 38 మంది రూట్ ఆఫీసర్స్‌ను నియమించారు. 4 మొబైల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేసి పోలీయో చుక్కలను వేయనున్నారు. పోలియో చుక్కలు వేసుకున్న పిల్లల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయనున్న అధికారులు అనివార్య కారణాల వల్ల ఎవరైనా తొలిరోజు ఆదివారం చుక్కల మందు వేయించుకోలేకపోతే వారి ఇళ్లకు వెళ్లి వేసేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకు డోర్ టూ డోర్ సర్వే సమాచారంతో వారిని గుర్తించనున్నారు. రెండు చుక్కల పోలియో మందుతో భయంకరమైన పోలియో వ్యాధి బారిన పడకుండా చిన్నారులను రక్షించడమే కాకుండా వారికి జీవితంలో మరికొన్ని వ్యాధులు కూడా రావని చిన్నారుల తల్లిదండ్రులకు ఇప్పటికే వివిధ రూపాల్లో అవగాహన కల్పించారు.
పల్స్ పోలియోకు ఏర్పాట్లు
*కలెక్టర్ ఇంతియాజ్
ఇంద్రకీలాద్రి, జనవరి 18: ఈనెల 19నుండి జిల్లాలో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 5ఏళ్ల లోపున్న పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు 2,568 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ వివరించారు. శనివారం స్థానిక కలెక్టర్ కార్యాలయం నుండి తుమ్మలపల్లి కళాక్షేత్రం వరకు నిర్వహించిన పల్స్ పోలియో అవగాహన ర్యాలీని నగరపాలక సంస్థ కమిషనర్ వీ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోలియో మహమ్మారిని పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అదే ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో 20ఏళ్లుగా ఒక పల్స్ పోలియో కేసు కూడా నమోదు కాలేదన్నారు. ఇప్పటి వరకు అందరి సమష్టి కృషి వల్లే సాధ్యమైందన్నారు. జిల్లాలో 5ఏళ్ల లోపు 4లక్షల, 6వేల, 491 మంది పిల్లలకు ఆదివారం విధిగా పల్స్ పోలియో చుక్కలు వేసేందుకు భారీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు. ఇందుకోసం శిక్షణ పొందిన 10,978 మంది వ్యాక్సినేటరులను నియమించినట్లు పేర్కొన్నారు. 5లక్షల, 60వేల పోలియో మందు డోసులను సిద్ధం చేయటంతోపాటు హైరిస్కు ప్రాంతాల్లో ఉండే పిల్లాలకు పోలియో చుక్కలు అందించేందుకు 97 ప్రత్యేక బృందాలను ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. 19న పోలియో చుక్కలు వేయించుకోని వారిని గుర్తించి వారి కోసం ప్రత్యేకంగా ఈనెల 20,21,22న కూడా పోలియో చుక్కలు వేసేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ టీఎస్‌ఆర్ మూర్తి, సీఎంఓ హెచ్ డాక్టర్ కే అర్జునరావు, డీఐఓ డాక్టర్ శర్మిష్ట, పల్స్ పోలియో ప్రత్యేక అధికారి డాక్టర్ వై సుబ్రహ్మణ్యం, పీ కృష్ణ మూర్తి, హర్షిత్ పాల్గొన్నారు.