విజయవాడ

విజయవంతంగా పల్స్ పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 19: జాతీయ పోలియో ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం నగరంలో చేపట్టిన పల్స్ పోలీయో కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కల మందు వేసే కార్యక్రమం నగరంలోని వన్‌టౌన్‌లోని బ్రాహ్మణ వీధి, మాజేటి ప్రహ్లాదరావు కల్యాణ మండపంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, గిరిపురం కమ్యూనిటీహాల్లో వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, న్యూ రాజరాజేశ్వరిపేట ఓడీఏ కమ్యూనిటీహాల్లో కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, రాజీవ్‌నగర్ కమ్యూనిటీహాల్లో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గంలోని ఆశోక్‌నగర్ శాంతి పబ్లిక్ స్కూల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి లాంఛనంగా ప్రారంభించారు. నగర వ్యాప్తంగా గుర్తించిన లక్షా 47వేల 485 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు మొత్తం 378 కేంద్రాలతోపాటు ప్రయాణ మార్గంలో ఉన్న చిన్నారుల సౌకర్యార్థం ప్రధాన కూడళ్లు, బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో కూడా పోలియో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ తమ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. అనివార్య కారణాలతో కేంద్రాలకు రాని పిల్లలను డోర్ టు డోర్ సర్వే చేసి గుర్తించిన వారికి కూడా తమ ఇళ్ల వద్ద పోలియో చుక్కలను వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. సామాజిక ఆరోగ్య అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా భవిష్యత్తులు పోలియో మహమ్మారిని సంపూర్తిగా నియంత్రించవచ్చని తెలిపారు. ఈకార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ ఇన్‌చార్జి వెంకటరమణ, వైద్యాధికారులు ఇక్బాల్ హుస్సేన్, రామకోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.