విజయవాడ

డివిజన్ల పునర్విభజనపై ముగిసిన అభ్యంతరాల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: నగరంలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాలు, సలహాలు, సూచనల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. మంగళవారం సాయంత్రం వరకూ అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు, ముందుగా ప్రకటించిన విధంగా ముగింపు సమయాన్ని అమలుచేయడంపై రాజకీయ పార్టీలలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం చేపట్టిన స్వీకరణలో మొత్తం 55 దరఖాస్తులు అందగా, వీటిని సమీక్షించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకోనున్నారు. స్వీకరించిన అభ్యంతరాలపై అధికారులు తీసుకునే చర్యలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొనగా, వివిధ రాజకీయ పార్టీలే కాకుండా నగర ప్రజల నుంచి కూడా పలు సూచనలు అందినట్టు అధికారులు తెలుపుతున్నారు. విభజన, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియపై నగర తెలుగుదేశంపార్టీ తీవ్ర అభ్యంతరం చెబుతోంది. ముగింపు తేదీని ఈనెల 27 వరకూ పొడిగించాలంటూ చేసిన వినతిని మున్సిపల్ అధికారులు పరిగణలోకి తీసుకోకపోవడం పై అసహనం వ్యక్తం చేస్తున్న టీడీపీ సీనియర్ నేతలు తదుపరి చర్యలపై వ్యూహరచన చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ విజయ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే విధంగా చేపట్టిన పునర్విభజన వైసీపీకి అనుకూలంగా పాలకులు వ్యవహరించారన్న ఆరోపణలు గుప్పిస్తుండగా, అధికారుల ఏకపక్ష ధోరణిపై పార్టీ పరంగా నిరసనలు చేపట్టాలని, ఎన్నికల ప్రక్రియపై ప్రభావం చూపే విధంగా న్యాయ పోరాటం చేయాలన్న ఆలోచనలపై టీడీపీ నేతలు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.