విజయవాడ

53వ డివిజన్‌లో అధిక ఓటింగ్‌పై టీడీపీ అభ్యంతరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో భాగంగా 53వ డివిజన్‌లో చేపట్టిన మార్పులపై తెలుగుదేశం పార్టీ తన అభ్యంతరాలను తెలిపింది. మంగళవారం నగర మాజీ డెప్యూటీ మేయర్ గోగుల రమణారావు, డివిజన్ టీడీపీ అధ్యక్షుడు గరిమెళ్ల చిన్న డివిజన్‌లో చేపట్టిన పునర్విభజనపై అభ్యతరాలు తెలుపుతూ ప్రస్తుతం పాత సింగ్‌నగర్‌లో కొంత భాగం, రామకృష్ణాపురం, దేవీనగర్, బుడమేరు మధ్యకట్ట, మధురానగర్ వరకూ ఉండే ఈ డివిజన్‌లో సుమారు 20వేలకు పైగా ఓటింగ్ ఉందని, గతంలో అజిత్‌సింగ్‌నగర్‌లోని కొంత భాగాన్ని ఈ డివిజన్‌లో కలపగా, పునర్విభజనలో ఆ ప్రాంతాన్ని విడదీసిన అధికారులు, డివిజన్‌కు సమీపంలో ఉన్న మధురానగర్ పప్పుల మిల్లు సమీపంలోని 1వ డివిజన్ పరిధిలోకి వచ్చే లెనిన్ నగర్ ప్రాంతాన్ని కొంత కలపడం వలన మళ్లీ డివిజన్ ఓటింగ్ 20వేలకు చేరుకుంటున్న విషయాన్ని గుర్తించాలన్నారు. 16వేల ఓటింగ్‌ను పరిగణలోకి తీసుకున్న అధికారులు అదే రీతిలో ఈ డివిజన్‌లో కూడా అదేరీతిన ఓటింగ్‌ను ఉంచాలని కోరారు. ఓటింగ్ సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఎన్నికలకు ఇబ్బందులకు గురవుతున్నట్టు వారు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఎన్‌వీ అర్బన్ అధ్యక్షుడు అద్దేపల్లి శివ, తదితరులు పాల్గొన్నారు.

వీఎంసీ వార్షిక బడ్జెట్‌పై కసరత్తు
* ఆదాయ, వ్యయాలపై సమాచారం ఇవ్వండి * అధికారులకు కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశం
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 21: 2020-21 వార్షిక బడ్జెట్ రూపకల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం వీఎంసీకి చెందిన వివిధ విభాగాల హెచ్‌ఓడీలతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. విభాగాల వారీగా ఆదాయ, వ్యయాలు, అభివృద్ధికి అవసరమైన నిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర గ్రాంట్ల ద్వారా వీఎంసీకి రావాల్సిన నిధుల వివరాలపై సమగ్రంగా నివేదిక రూపొందించి అందజేయాలని అధికారులను ఆదేశించారు. గత వార్షిక బడ్జెట్‌లో పొందుపర్చిన ఆదాయ, వ్యయాలకు సంబంధించి వివరాలు, ఇప్పటివరకూ చేసిన ఖర్చు, ఇంకా చేయాల్సిన వ్యయాలపై చర్చించిన కమిషనర్ 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాల వివరాలను వాస్తవ లెక్కల ఆదారంగాను, బడ్జెట్ చూపాల్సిన ఎస్సీ, ఎస్టీ, మహిళా, శిశు, సంక్షేమం, దివ్యాంగులు, ఇతర నగరాభివృద్ధికి నింబంధనల ప్రకారం చూపాల్సిన కేటాయింపులతో బడ్జెట్ అంచనాలను రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ ఏ మోహనరావు, అదనపు కమిషనర్ యు శారద, సీఈ మరియన్న, ఎస్‌ఈ జేవీ రామకృష్ణ, సీఎంహెచ్‌ఓ ఇన్‌చార్జి వెంకటరమణ, సిటీ ప్లానర్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.