విజయవాడ

హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జనవరి 21: ద్విచక్ర వాహనాలతో జరిగే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది యువకులు ఉంటున్నారని, అధిక స్పీడ్, హెల్మెట్ ధరించకపోవడం అందుకు కారణాలని, రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృత్యువాత పడుతున్నారని డీటీసీ ఎస్. వెంకటేశ్వరరావు అన్నారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు పురస్కరించుకుని మంగళవారం ఆంధ్రా లయోలా కళాశాలలో విద్యార్ధులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించకపోవడం వల్లే ప్రమాదాల బారిన పడుతున్నారని, దానికితోడు రాంగ్ రూట్లో వెళ్ళేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారని తెలిపారు. యువతలో మార్పు వస్తే గానీ ఈ ప్రమాదాలను ఆరికట్టలేమని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణలో పోలీసు, రవాణాశాఖ చేయాలంటే పూర్తిస్థాయిలో సాధ్యం కాదని, యువత, స్వచ్ఛంద సంస్ధలు అందరూ కలసి రోడ్డు ప్రమాదాలు జరగకుండా కార్యక్రమాల ద్వారా అవగాహన చేపట్టాలని అన్నారు. రోడ్డు నిబంధనలు పాటించే విధంగా ప్రజలలో కూడా చైతన్యం వచ్చిన రోజునే ప్రమాదాలు తగ్గించగలమని చెప్పారు. విద్యార్ధులపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉంటారని, వారిని ఉన్నత స్థాయిలో చూడాలనుకుంటారని అన్నారు. నిర్లక్ష్యంతో జరిగిన రోడ్డు ప్రమాదం వలన తల్లిదండ్రులకు శోకసంద్రంలో ముంచుతున్నారని అన్నారు. మితిమీరిన వేగం, ట్రిబుల్ డ్రైవింగ్, రాంగ్ టూట్‌లో ప్రయాణించడం వంటివి చేయోద్దని కోరారు. ద్విచక్ర వాహనం బయటకు తీసేటప్పడు హెల్మెట్ ధరించాలని, తర్వాతనే వాహనాన్ని నడపాలని కొద్ది దూరమే కదా అని నిర్లక్ష్యం వహించవద్దని ఆయన అన్నారు. ప్రమాదాలు నివారించే దిశగా యువత తమవంతు సామాజిక బాధ్యత వహించి రోడ్డు నియమాలను పాటిస్తూ వాహనాలను నడపాలని అన్నారు. అప్పుడే ప్రమాదాలు సంఖ్య గణనీయంగా తగ్గించగలమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో లయోలా కళాశాల ప్రిన్సిపాల్ జిఎం విక్టర్ ఇమ్మానియేలు, ఎస్‌జే మోటార్ తనిఖీ అధికారులు సంజీవ్‌కుమార్, ప్రవీణ్, రవాణాశాఖ ఉద్యోగులు సంఘం జోనల్ అధ్యక్షుడు యం.రాజబాబు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.