విజయవాడ

ప్రజా ఉద్యమం ముందు ఎవరైనా తలవంచాల్సిందే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జనవరి 21: ఆంధ్రుల రాజధాని అమరావతి కొనసాగించాలని నిరసిస్తూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మంగళవారం పటమట పంట కాలువ రోడ్డులోని మారిస్‌స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియం నుండి ప్రారంభమైన నిరసన ర్యాలీ పంటకాలువ సనత్‌నగర్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని ముఖ్యమంత్రి డౌన్.. డౌన్.. అమరావతి ముద్దు, మూడు రాజధానులు వద్దు.. తుగ్లక్ పాలన మా కొద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ మాజీ ఛైర్‌పర్సన్ గద్దె అనురాధ మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతిని తరలించవద్దని డిమాండ్ చేశారు. మూడు రాజధానులు అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ప్రాంతీయ విద్వేషాలు పెరుగుతున్నాయని తెలిపారు. ఎన్నడు లేని విధంగా మహిళలు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలుపుతున్న ప్రభుత్వం చలనం లేకపోవడం బాధకరమన్నారు. సంఖ్యా బలం ఉందని, ఆసెంబ్లీలో తీర్మాణం చేసుకుంటున్నారని, రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులపై లాఠీచార్జి చేయడం ఎంటి అని ప్రశ్నించారు. ప్రజా ఉద్యమం ముందు ఎవ్వరైన దిగిరావాల్సిందే అన్నారు. రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్నామని, అమరావతి నుండే పరిపాలన జరగాలని అన్నారు. అమరావతి అభివృద్ధికి సీఎం జగన్ అడ్డుపడుతున్నారని, విశాఖ వెళ్ళడం వలన వచ్చే లాభం ఏమిటో జగన్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ అమరావతి రైతులకు అన్యాయం జరిగితే మరింత ఉద్యమ్యాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమరావతి నుండి ఢిల్లీ వరకు రాజధాని రైతుల తరుపున పోరాడతామని హెచ్చరించారు. ఇప్పటికైన జగన్మోహన్‌రెడ్డి తన మొండి వైఖరిని విడనాడి రాజధాని అమరావతిని కొనసాగుతుందని ప్రకటన చేయాలని లేకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. జేఏసీ కన్వీనర్ శివారెడ్డి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి మోడి ఇతర కేంద్ర మంత్రులు కలసి అమరావతి రాజధానిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాజధాని కోసం 33 ఎకరాలు ఉచితంగా ఇచ్చిన రైతులపై, మహిళలపై పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్‌లు ఆర్‌వి స్వామి, గద్దె తిరుపతిరావు, ప్రొఫెసర్ కొలకపూడి శ్రీనివాసరావు, అక్కినేని వనజా, రావి సౌజన్య, డాక్టర్ శ్రీదేవి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.