విజయవాడ

అమ్మఒడి నిండినా.. జమకాని స్కూల్ ఫీజులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, జనవరి 21: రాష్ట్ర ప్రభుత్వ అమ్మఒడి పథకం చిన్నారుల తల్లిదండ్రులకు వరంగా మారిందే గాని ప్రైవేట్ విద్యాసంస్థలకు శాపంగా మారిందని విద్యాసంస్థల అధినేతలు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా పశ్చిమలోని పలు విద్యాసంస్థలు పేద, బడుగు విద్యార్థులకు అందుబాటులో ఉండేలా ఫీజులు ఉంటున్నాయి. రెక్కాడితేకాని డొక్కాడని నిరుపేదలు, రోజువారీ కూలీలు, టాపీపని, మట్టిపని, రిక్షా, ఆటోరిక్షా, ముఠా పనివారల కుటుంబాలే పశ్చిమంలో ఎక్కువగా ఉన్నాయనేది అందరికీ తెలిసిందే. నగరంలోని సెంట్రల్, తూర్పు నియోజకవర్గాల్లో కార్పొరేట్ కళాశాలలు, స్కూళ్లు ఉన్నాయి. పశ్చిమంలో మాత్రం కానె్వంట్లు, హైస్కూళ్లు అన్నీ పేదల పిల్లలు చదివేవే. ఫీజులు కూడా నామమాత్రంగా ఉంటాయి. గట్టిగా అడిగినా, ఫీజులు పెంచినా విద్యార్థి చేజారి పోతాడేమోనని సర్దుకు పోతున్న ప్రైవేట్ విద్యాసంస్థలే ఎక్కువ. అయితే అమ్మఒడి పథకం ఇలాంటి విద్యాసంస్థలకు శరాఘాతంగా మారింది. అమ్మఒడి నగదు రాగానే బకాయి ఫీజులు నయాపైసా సహా చెల్లిస్తామని కాలయాపన చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు నగదు బ్యాంకు ఖాతాల్లో జమ అయినా గాని స్కూలు ఫీజులు చెల్లించలేదు. అమ్మఒడి మహిళల్లో పండగ వాతావరణం తెచ్చింది. వెంటనే సంక్రాంతి పండగ వచ్చింది. ఆ పండగకు నగదు ఖర్చు చేసేవారు. అంతే స్కూల్ బకాయిలు తీరకపోగా రెండు మూడు నెలల బకాయిల్లా నాలుగో నెలకు చేరాయి. అంతే ఆ ప్రభావం ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలపై పడిందని వాపోతున్నారు. అమ్మఒడి పథకం నగదు రాగానే బకాయిలు తీరకపోగా పెరిగిపోయాయని, బోధనా సిబ్బందికి జీతాలు భారంగా మారాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మఒడి అమ్మానాన్నలకు వరంగా మారితే ప్రైవేట్ స్కూళ్ల నిర్వాహకులకు శాపంగా మారిందని ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు.