విజయవాడ

గరుడ వాహనంపై దేవేరులతో కోనేటి రాయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, జనవరి 23: చరాచర సృష్టి కారకుడు, ఈ జగత్తును నడిపించే జగన్నాథుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని కనులారా చూసి తరించాలని అశేష భక్తజనం తండోపతండాలుగా రావడం తో భవానీపురం పున్నమి ఘాట్ కోలాహలంగా మారింది. శ్రీవారి నిత్యోత్సవాల్లో భాగంగా కోరిన వారి కోర్కెలు తీర్చే కొండంత దేవుడు వెంకన్న స్వా మి పవిత్ర కృష్ణానదీ తీరాన కొలువై భక్తులను తరింపజేస్తున్నాడు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవీ సేవా సమితి 14వ వార్షికోత్సవం సందర్భంగా పున్నమి ఘా ట్‌లో రెండో సంవత్సరం కూడా ఇక్కడ శ్రీవారి కల్యాణోత్సవాలు ఏర్పాటు చేశారు. తిరుమలలో జరిగే వైఖానస ఆగమ శాస్త్రానుసారం స్వామివారికి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు నిత్యకైంకర్యాలతో పూజాదికాలు నిర్వహిస్తున్నారు. స్వామివారి వాహన సేవలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. గురువారం స్వామివారికి ప్రీతికరమైన తిరుప్పావడ సేవ కన్నులపండువగా జరిగింది. తెల్లవారుజామున స్వామివారి మేలుకొలుపు సుప్రభాత సేవతో హారతులిచ్చి ప్రారంభించారు. తోమాల సేవ, విశ్వరూప దర్శనం, కొలువు, సహస్ర నామార్చనలతో విశేష పూజలు నిర్వహించారు. యాగశాలలో మహాశాంతి హోమం ఘనంగా నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదపూడి గ్రామంలోని స్వయం అవగాహన ట్రస్ట్ అవధూత నిర్గుణ చైతన్యస్వామి, ఇతర అనేక మంది స్వామీజీలు ఇక్కడ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. వారాంతపు సేవల్లో భాగంగా గురువారం తిరుమలలో వెంకటేశ్వరస్వామికి నిర్వహించే తిరుప్పావడ సేవ ఘనంగా చేశారు. ఈ సేవల్లో పాల్గొనేందుకు పెద్దసంఖ్యలో భక్తులు రావడంతో పున్నమి ఘాట్, పరిసర ప్రాంతాలు గోవింద నామస్మరణతో మారుమోగాయి. జాజులు, మల్లెలు, కనకాంబరాలు వంటి అనేక రకాల పుష్పాలతో స్వామివారిని సుందరంగా అలంకరిస్తూ అలంకార ప్రియుడుగా తీర్చిదిద్దుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకులు రాజమోహన్ స్వామివారి కీర్తనలతో భక్తులను ఆధ్యాత్మికంగా పరవశింపజేశారు. విద్యార్థినీ విద్యార్థులు సరస్వతి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు అమ్మవారి బీజాక్షరాలతో ఉచిత సామూహిక సరస్వతీ పూజ ఏర్పాటు చేశారు. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం స్వామివారు గరుడ వాహనంపై శోభాయమానంగా విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గరుడ వాహన సేవలో పెద్దసంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. నిర్వాహకులు గరిమెళ్ల నానయ్య చౌదరి, దూపగుంట్ల శ్రీనివాస్, మామిడి లక్ష్మీ వెంకట కృష్ణారావు, ఉదయగిరి శ్రీనివాస్ బాబు, పట్నాల నరసింహారావు, చలవాది మల్లికార్జునరావు, పట్నాల శ్రీనివాసరావు భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు పర్యవేక్షించారు. శుక్రవారం వారాంతపు సేవల్లో భాగంగా శ్రీవారి మూలమూర్తికి అభిషేకం సేవ ఏర్పాటు చేశారు.