విజయవాడ

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జనవరి 23: జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కే విజయానంద్ ఆదేశించారు. గురువారం వెలగపూడి సీఈవో కార్యాలయం నుండి రాష్ట్ర ఎన్నికల అధికారి కే విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎన్నికల అధికారి కే విజయానంద్ మాట్లాడుతూ ఈనెల 25న రాష్ట్ర స్థాయి జాతీయ ఒటర్ల దినోత్సవాన్ని నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 10గంటలకు నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఇంతియాజ్‌కు సూచించారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో బూత్ లెవెల్ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించి ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ఇందుకు సంబంధించి ర్యాలీలు, విద్యార్థులకు వ్యాస రచన, తదితర పోటీలను నిర్వహించాలన్నారు. ఓటర్ల సవరణ కార్యక్రమం ఈనెల 22నుండి ఓటర్ల నుండి చేర్పులు, మార్పులు, సంబంధించి అందిన దరఖాస్తులు, ఫిర్యాదులను ఫిబ్రవరి 3నాటికి పరిష్కరించాలన్నారు. ఫిబ్రవరి 11నాటికి ఓటర్ల జాబితా అనుబంధ కాపీలను సిద్ధం చేసి ఫిబ్రవరి 14న ఓటర్ల జాబిత ముద్రించాలన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితాలో మార్పులు, మార్పులు, సంబంధించి 14,147 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. లాజికల్ తప్పుల సవరణలో 3099 ఉండగా ఇంతవరకు 2439 సరిచేయడం జరిగిందన్నారు. జిల్లాలో 6 నియోజకవర్గానికి సంబంధించి సరిహద్దుల మ్యాపింగ్ సవరణ వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ఈసమావేశంలో డీఆర్‌ఓ ఏ ప్రసాద్, డీఆర్‌పీఏ పీడీ శ్రీనివాసరావు, మచిలీపట్నం ఆర్‌డీఓ ఖజావలీ, డీఈఓ రాజ్యలక్ష్మీ, పాల్గొన్నారు.