విజయవాడ

బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ త్వరలో ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, జనవరి 25: బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ పనులను ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఇతర టీడీపీ నాయకులు శనివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఎంపీ నాని మాట్లాడుతూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చొరవతో నగరవాసుల దశాబ్దాల కల అయిన బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ వంతెన పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే రెండో వైపు పనులు ప్రారంభం అవుతాయని చెప్పారు. పటమటలంక స్క్రూృ బ్రిడ్జి నుంచి లయోలా కళాశాల దగ్గరలోని హోటల్ నోవాటెల్ వరకు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయన్నారు. నగరంలో నిత్యం రద్దీగా ఉండే రెండు జాతీయ రహదారుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి 300 కోట్లతో బెంజి సర్కిల్ వద్ద రెండు ఫ్లైఓవర్లకి అనుమతులు పొందారని, టీడీపీ పాలనలోనే పనులు ప్రారంభించామన్నారు. ఇప్పటికే ఒకవైపు నిర్మాణం పూర్తియిన ఫ్లైఓవర్‌తో బెంజి సర్కిల్, నిర్మలా కానె్వంట్ జంక్షన్, రమేష్ హాస్పిటల్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయన్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో దీన్ని నిర్మించారన్నారు. మరో వారం రోజుల్లో ఫ్లైఓవర్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని కేశినేని వివరించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ రెండు వైపుల మీద ఆరు వరుసల రహదారి, ఫ్లైఓవర్ కింద 8 వరసల రహదారులతో సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్టు తుది దశకు చేరుకుందన్నారు. మొదటి ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుండగా రెండోవైపు పనులు వెంటనే ప్రారంభం అవుతాయన్నారు. ఎస్వీఎస్ కల్యాణ మండపం వద్ద పటమటలంక వాసుల కోసం సర్వీస్ రోడ్డు విస్తరణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ కోనేరు శ్రీ్ధర్, టీడీపీ నాయకులు గౌరంగబాబు, చెన్నుపాటి గాంధీ, దాసరి మల్లేశ్వరి, ముమ్మనేని ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.