విజయవాడ

గణతంత్ర వేడుకలకు భద్రత కట్టుదిట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 25: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగనున్న 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు హాజరుకానున్న దృష్ట్యా నగర పోలీసుశాఖ కట్టుదిట్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. అదేవిధంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ట్రాఫిక్ చర్యలు తీసుకున్నారు. ఏఏ కారు పాసులు కలిగిన ఆహ్వానితులు ఆర్టీఏ జంక్షన్ మీదుగా గేటు నెంబర్-3 ద్వారా స్టేడియంలోకి చేరుకుని తర్వాత వాహనాలు ఫుట్‌బాల్ కోర్టులో పార్కింగ్ చేసుకోవాలి. ఏ 1కారు పాసులు కలిగిన వారు గేటు నెంబర్ 4 ద్వారా స్టేడియంలోకి చేరుకుని వాహనాలు హ్యాండ్ బాల్ కోర్టులో పార్కింగ్ చేసుకోవాలి. ఏ 2, ఏ 3 కారు పాసులు కలిగిన వారు గేటు-4 ద్వారా స్టేడియంలోకి చేరుకుని వాహనాలు బిషప్ అజరయ్య స్కలులో పార్కింగ్ చేసుకోవాలి. బి 1 కారు పాసులు కలిగిన వారు గేటు-2 ద్వారా లోపలికి వచ్చి ఫుట్ బాల్ కోర్టులో పార్కింగ్ చేసుకోవాలి. బీ 2 కారు పాసులు కలిగిన వారు గేటు-2 ద్వారా లోపలికి చేరుకుని ఏఆర్ గ్రౌండులో పార్కింగ్ చేసుకోవాలి. సాధారణ ప్రజలు శిఖామణి సెంటర్ మీదుగా వెటర్నరీ జంక్షన్ చేరుకుని గేటు-5ద్వారా స్టేడియంలోకి చేరుకుని వాహనాలు పీడబ్ల్యూడీ గ్రౌండులో పార్కింగ్ చేసుకోవాలి. స్కూలు విద్యార్థులతో వచ్చే బస్సులు 7గంటల్లోగా స్టేడియం చేరుకోవాలి. ఆటోనగర్, భవానీపురం, వన్‌టౌన్, సింగ్‌నగర్, సత్యనారాయణపురం రామవరప్పాడు వైపు నుంచి వచ్చే స్కూలు బస్సులు పీడబ్ల్యూడీ గ్రౌండులో పార్కింగ్ చేసుకోవాలి. భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియంలో 26న వాకర్స్‌కు అనుమతి లేదని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.
వేడుకలకు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు
గణతంత్ర వేడుకలు పురస్కరించుకుని అంతరాయం కలిగించాలనుకుంటే అట్టి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీసు కమిషనర్ స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం జరిగే 71వ రిపబ్లిక్ వేడుకలకు గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు హాజరవుతున్న దృష్ట్యా విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలకు ఆటంకం కలిగించినా జాతీయతను, దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కించపరిచినట్లు అవుతుందని, ఎవరైనా నిరసన ప్రదర్శనల ద్వారా కార్యక్రమానికి అంతరాయం కలిగించినా, ప్రోత్సహించినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.

వెటర్నరీ డాక్టర్ శ్రీనివాసరావుకు
రాష్టస్థ్రాయి ఉత్తమ ప్రతిభా అవార్డు
పటమట, జనవరి 25: నగరంలోని ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ కామని శ్రీనివాసరావుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలకు గాను రాష్టస్రాయ్థి ప్రతిభా అవార్ట్‌ను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఆదివారం నగరంలో ఆయనకు ప్రభుత్వం అవార్డ్‌ను ప్రదానం చేయనుంది. 2016లో ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కామని శ్రీనివాసరావు ఇదే ఆసుపత్రిలో ఇప్పటివరకు పశువులు, కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, గుర్రాలు, కోతులు, కొండముచ్చులకు సంబంధించి 788 మేజర్ ఆపరేషన్లు చేశారు. అంతకుముందు ఆయన పటమట, కొండపల్లి, మూలపాడు, ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతంలో, విశాఖపట్నంలో వెటర్నరీ డాక్టర్‌గా సేవలు అందించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో గన్నవరంలోని ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైనె్సస్‌లో కొద్దికాలం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విద్యార్థులకు సేవలందించారు. డాక్టర్ కామని శ్రీనివాసరావు గత 26 సంవత్సరాలుగా వెటర్నరీ డాక్టర్‌గా ఉత్తమ సేవలు అందించినందుకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రాష్టస్థ్రాయి మెరిటోరియస్ అవార్డ్ ప్రదానం చేయనుండటంతో ఎన్టీఆర్ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ వైద్యులు, సిబ్బంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.