విజయవాడ

నగర ‘పోలీసు’కు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 25: నగర పోలీసుశాఖకు అరుదైన గౌరవం దక్కింది. నగర పోలీసు కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఏసీపీ స్థాయి అధికారికి ప్రతిష్టాత్మకమైన రాష్టప్రతి పోలీసు పతకం లభించడం గర్వంగా నిలిచింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈఏడాది కేంద్రం ప్రభుత్వం వెస్ట్‌జోన్ ఏసీపీ కొట్ర సుధాకర్‌కు ప్రెసిడెంట్స్ పోలీసు మెడల్ ప్రకటించడం పట్ల నగర కమిషనరేట్ వర్గాలు అభినందన జల్లు కురిపిస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో ఫ్యాక్షనిజం తీవ్రంగా ఉన్న సమయంలో దాన్ని అణిచివేయడంలో అప్పటి సీఐగా ఉన్న సుధాకర్ పనితీరు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది. ప్రకాశం జిల్లా చీరాల మండలం కావూరి వారిపాలెంకు చెందిన సుధాకర్ 1991లో ఎస్‌ఐగా పోలీసుశాఖలో ప్రవేశించారు. తొలుత గురజాలలో 6నెలల శిక్షణ అనంతరం నాదెండ్ల, చేబ్రోలు పోలీస్టేషన్లలో విధులు నిర్వహించారు. 1995 పంచాయతీ ఎన్నికల సమయంలో చేబ్రోలు ఎస్‌ఐగా సమర్థవంతంగా విధులు నిర్వహించడంలో అప్పటి ఎస్పీ మాల కొండయ్య ప్రశంసలు అందించి చిలకలూరిపేట టౌన్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత క్రమంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఎస్‌ఐగా పనిచేస్తున్న సమయంలో శాంతి భద్రతల పరిరక్షణకు చేసిన కృషి, తీసుకున్న కఠిన నిర్ణయాలు జనం జేజేలు అందుకున్నాయి. గురజాలలో ఫ్యాక్షనిస్టుల నుంచి నాటుబాంబులు స్వాధీనం చేసుకోవడంలో విశేష ప్రతిభ కనపరిచి అప్పటి ఎస్పీ మీనా ప్రశంసలు అందుకున్నారు. చిలకలూరిపేటలో అసాంఘిక శక్తులను అణిచివేతకు నాంది పలికి కిడ్నాప్‌లు, దోపిడీలు, హత్యలు సంచలన కేసుల్లో నిందితులను అరెస్టు చేయడంలో పనితీరు కనపరిచారు. తాడేపల్లి ఎస్‌ఐగా ఉన్న సమయంలో కంచనపల్లి ఫ్యాక్షన్ గ్రామంలో శాంతి భద్రతలు నెలకొల్పేందుకు చూపిన చొరవ నేటికీ గ్రామస్థులు మరువలేరు. దాచేపల్లి ఎస్‌ఐగా ఉండగా ఇద్దరు కానిస్టేబుళ్లను మావోయిస్టులు అపహరించడం రాత్రికి రాత్రే సానుభూతిపరులు ఇళ్లపై దాడి చేసి వారిని అదుపులోకి తీసుకుని సురక్షితంగా విడుదల చేయడంలో కీలకపాత్ర పోషించారు. ఏ 2003 జనవరి 5న జన్మభూమి కార్యక్రమం బహిష్కరించి మావోయిస్టులు మందుపాతర పేల్చగా ఇరువురు సహచరులు ప్రాణాలు కోల్పోగా గాయపడిన సిబ్బందికి ఆత్మస్థైర్యం నింపడమే కాకుండా కొనఊపిరితో ఉన్న మరో కానిస్టేబుల్ శ్రీనివాసరావు దారిలో మందుపాతరలు ఉన్నాయని హెచ్చరించినా తన ద్విచక్ర వాహనంపై దాచేపల్లిలో ఆస్పత్రికి తరలించి తిరిగి కూంబింగ్‌లో పాల్గొన్నారు. దీంతో అప్పటి ఎస్పీ రవిశంకర్ అయ్యన్నార్ (ప్రస్తుతం లా అండ్ అర్డర్ అదనపు డీజీ) ప్రశంసించి రూ.5వేలు రివార్డు అందించారు. ఆ తర్వాత సుధాకర్ ఇంటిలిజెన్స్ విభాగంలో చేరి పదేళ్లకు పైగా ప్రభుత్వానికి కచ్చితమై సమాచారం అందించారు. 2008లో సేవా పతకం పొందారు. వీటితోపాటు 2004, 2009 ఎన్నికల సందర్భంగా విశేష సేవలు అందించింనందుకు గుర్తింపుగా ఇండియన్ పోలీసు మెడల్‌కు సుధాకర్‌ను ప్రభుత్వం ఎంపిక చేసింది. 2014లో డిఎస్పీగా ప్రమోషన్ పొంది గుంటూరు సీసీఎస్, ఎస్‌బీ, ఓఎస్‌డీగా విధులు నిర్వహించారు. 2105లో సుధాకర్ ఆంధ్ర రాష్ట్ర ఉత్తమ సేవా పతకం పొందారు. 2018 జూన్ నుంచి నగర పోలీసు కమిషనరేట్ వెస్ట్ జోన్ ఏసీపీగా విధులు నిర్వహిస్తూ విధి నిర్వహణలో విశేష ప్రతిభ కనపరుస్తూ రాష్ట్ర డీజీపీ దామోదర గౌతం సవాంగ్, నగర పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు ప్రశంసలు అందుకున్నారు. ఈక్రమంలో డీజీపీ, సీపీ సిఫార్సు మేరకు ప్రెసిడెంట్ పోలీసు మెడల్ సుధాకర్‌కు దక్కడం విశేషం.