విజయవాడ

పూరగుట్ట స్థలాన్ని పరిశీలించి జడ్పీ సీఈఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జనవరం 25: జిల్లాపరిషత్ సీఈఓ, మైలవరం నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సూర్యప్రకాశరావు శనివారం మైలవరం సమీపంలోని పూరగుట్ట స్థలాన్ని పరిశీలించారు. పూరగుట్టలో నిరుపయోగంగా ఉన్న సుమారు 80 ఎకరాల అటవీ భూమి ఇటీవల కలెక్టర్ ఇంతియాజ్ స్వయంగా పరిశీలించి పేదలకు ఇళ్ళ స్థలాలుగా మంజూరు చేయటానికి అనువుగా ఉందని పేర్కొన్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని స్థానిక అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో జడ్పీ సీఈఓ శనివారం పూరగుట్ట ఇళ్ళ స్థలాన్ని, జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక అధికారులకు తగు సూచనలు చేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఉగాది నాటికి అర్హత కలిగిన పేదలందరికీ ఇళ్ళ స్థలాల పంపిణీ చేయాల్సి ఉందని దానికనుగుణంగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. ఈకార్యక్రమంలో తహశీల్దార్ రోహిణీదేవి, ఎంపిడిఓ సుబ్బారావు, వీఆర్వోలు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఘనంగా ఓటర్ల దినోత్సవం
ముదినేపల్లి, జనవరి 25: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని శనివారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిస్వార్ధంగా వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని ఎంఇఓ బి శ్రీనివాస్ అన్నారు. వైవాక ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఓటర్ల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిక చేసిన సీనియర్ ఓటర్లను సత్కరించారు. ఓటర్లు, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. వివిధ పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్‌ఓ ఫణి, హెచ్‌ఎం నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.