విజయవాడ

పూర్ణాహుతితో ముగిసిన శ్రీవారి నిత్యోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, జనవరి 26: పవిత్ర కృష్ణానదీ తీరాన ఇంద్రకీలాద్రి సమీపాన, కొలువు తీరిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి నిత్యోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ నెల 20నుండి 26వరకు 7 రోజులపాటు శ్రీదేవీ భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాలను కన్నుల పండువగా నిర్వహించారు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు నగరం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొలిపి పూజాదికాలు నిర్వహించారు. విశ్వరూప దర్శనం తోమాల సేవ, కొలువు, సహస్రమార్చన అనంతరం యాగశాల యందు మహాశాంతి హోమం నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతితో కార్యక్రమాన్ని పరిసమాప్తం చేశారు. శ్రీవారి నిత్యోత్సవాలు ప్రారంభం సందర్భంగా కంకణధారణ ధరించిన కమిటీ నిర్వాహకులు గరిమెళ్ల నానయ్య చౌదరి, ధూపగుంట్ల శ్రీనివాస్, మామిడి లక్ష్మీ వెంకట కృష్ణారావు, ఉదయగిరి శ్రీనివాస్‌బాబు తదితరులు పూర్ణాహుతి అనంతరం కంకణ విసర్జన చేశారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చివరి రోజున శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారికి పవిత్ర నదీ జలాలతో, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, కన్యలచే సామూహిక కుంకుమార్చన సేవలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరస్వామికి అత్యంత వైభవంగా కళ్యాణం నిర్వహించారు. ఏకాంత సేవకు స్వామివారి ఆలయాన్ని అంతరాలయంలో పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఏకాంత సేవ కోసం ఆలయంలో పవళింపు సేవకై ఉయ్యాలను ఏర్పాటు చేశారు. దేవతామూర్తులను అందులో ఉంచి సన్నాయి, వీణ నాదాలతో స్వామి వారిని నిద్రపుచ్చారు. సోమవారం ఉదయం పూజాధికాలు నిర్వహించి అభిషేకం అనంతరం స్వామి వారి మూల మూర్తిని కదిపి ఉత్సవాలు ముగించడం జరుగుతుందని నిర్వాహకులు గరిమెళ్ల నాగయ్య చౌదరి, దూపగుంట్ల శ్రీనివాస్, మామిడి లక్ష్మీ వెంకట కృష్ణారావు, ఉదయగిరి శ్రీనివాస్‌బాబు తదితరులు తెలిపారు.

ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లు
జీవించే హక్కుకే ప్రమాదం
* ప్రొఫెసర్ మాడభూషి శ్రీ్ధర్

విజయవాడ, జనవరి 26: ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌లు జీవించే హక్కుకే ప్రమాదకరమని జాతీయ సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్, బెనె్నట్ యూనివర్శిటీ డీన్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీ్ధర్ అన్నారు. నగరంలోని ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ‘్భరత రాజ్యాంగ పౌరసత్వ హక్కులు’ అనే అంశంపై ఆదివారం జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు.