విజయవాడ

అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లనే ప్రజాస్వామ్యంలో జీవించ గలుగుతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 26: భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లనే నేడు మనందరం ప్రజాస్వామ్య దేశంలో జీవించగలుగుతున్నామని, వారు చేసిన సేవలను గౌరవించాల్సిన కర్తవ్యం అందరిపై ఉందని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం ఉదయం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన తొలుత గాంధీజీ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి వీఎంసీ పతాకాన్ని ఎగురవేసిన కమిషనర్ విద్యార్థులచే నిర్వహించిన మార్చ్ఫాస్ట్‌లో గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈసందర్భంగా జరిగిన సభలో కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ స్వాతంత్య్రదినోత్సవం, గణతంత్ర దినోత్సవ విశిష్టతలతోపాటు నాడు స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాడి అశువులు భాసిన త్యాగధనులు, స్వాతంత్య్రానంతరం స్వదేశీ పాలనలోకి వచ్చిన దేశంలో ప్రజల అభ్యున్నతికి మహనీయులు అనుసరించిన విధానాలు, వారి సేవలు త్యాగాలను నేటి తరంతోపాటు భవిష్యత్తు తరాల వారికి కూడా తెలిసే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 1930లోనే భారత దేశాన్ని పూర్ణ స్వరాజ్ అని ప్రకటించారని, కాగా 1947లో సంపూర్ణ స్వాతంత్య్రం ప్రకటించిన బ్రిటీషర్ల పాలన అనంతరం మన దేశం, మన రాజ్యాంగాన్ని రూపొందించుకుని సుప్రీమ్ పవర్ భారత రాజ్యాంగమేనని, దానికనుగుణంగానే ప్రజాస్వామ్యం నడుస్తూ దేశ పౌరులందరికీ సమాన హక్కులు అందించిందన్నారు. రాజ్యాంగ రూపకల్పనలో బీఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు నిరుపమానమని, ఎంతో మేథస్సుతో రూపొందించిన రాజ్యాంగం నేటి ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలకు దిక్సూచిగా మారిందనడంలో అతిశయోక్తి లేదన్నారు. అలాగే దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో మహాత్మాగాంధీ అందించిన సేవలను స్మరిస్తూ, ఆయన చూపిన స్వచ్ఛత, పరిశుభ్రతలను కొనసాగించి దేశాన్ని స్వచ్ఛతా వైపు పయనింప చేయాలన్న లక్ష్యంతో భారత స్వచ్ఛత మిషన్‌ను జాతీయ స్థాయిలో ప్రకటించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వేలాది నగరాలలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరుగుతోందని, అంబేద్కర్, మహాత్మాగాంధీలను స్ఫూర్తిగా తీసుకుని నగరంలో పరిశుభ్రత చర్యలు పాటించి, ప్రస్తుతం జరుగుతున్న స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో నగరానికి ఉత్తమ ర్యాంకు వచ్చేలా నగర పౌరులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో అదనపు కమిషనర్ ఏ మోహనరావు, సీఎంహెచ్‌ఓ వెంకటరమణ, సిటీ ప్లానర్ లక్ష్మణరావు, డీసీఆర్ వెంకటలక్ష్మీ, ఎగ్జామినర్ ఆశోక్‌వౌర్య, తదితరులు పాల్గొనగా వీఎంసీ పాఠశాలల విద్యార్థులు జాతీయ, దేశ భక్తి గీతాలాపన చేయగా వీఎంసీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సీ వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు.