విజయవాడ

ప్రయాణికుల భద్రత, సౌకర్యాలే ప్రధాన ధ్యేయంగా ఎస్సీ రైల్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (రైల్వేస్టేషన్), జనవరి 26: ప్రజల ఆదరణ చూరగొనే దిశగా ప్రయాణికుల భద్రత, రక్షణ, సౌకర్యాలను దక్షిణ మధ్య రైల్వే కల్పిస్తుందని విజయవాడ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ పీ శ్రీనివాస్ అన్నారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడ రైల్వే స్టేషన్‌కు ఎదురుగా ఉన్న రైల్వే మిని స్టేడియంలో డీఆర్‌ఎం శ్రీనివాస్ జాతీయ జెండాని ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్), భారత స్కౌట్స్ అండ్ గైడ్, పాఠశాల విద్యార్థులు ఇచ్చిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఇచ్చిన సందేశాన్ని ఆంగ్లంలో చదివి వినిపించారు. ఇందులో ప్రధానంగా రైల్వేలో ఉద్యోగ బృందమే సంస్థకు ప్రధానమైన బలమని అన్నారు. వారి నైపుణ్యాల కారణంగా అభివృద్ధితోపాటు పని సారధ్యాన్ని పెంచడం వలన దక్షిణ మధ్య రైల్వే ప్రథమ ప్రాధాన్యతల్లో ఒకటిగా నిలవగలిగిందన్నారు. ఇదే తరహాలో ఇంజనీరింగ్ విభాగంలో ఈడాస్ ద్వారా డ్రాయింగ్‌లన్ని ఆన్‌లైన్ ఆమోదం పొందే విధంగా చేయడం వలన అత్యంత వేగంగా రైల్వే ప్రాజెక్టులు నిర్ణీత కాలంలోనే పూర్తయే అవకాశాలు కలుగుతుందన్నారు. నిర్ణీత సమయంలో ఆదాయ సముపార్జనలో భాగంగా ఏప్రిల్ నుండి డిసెంబర్ మద్య కాలానికి స్థూప ఆదాయం పది వేల కోట్ల మైలురాయిని దక్షిణ మధ్య రైల్వే మరో సారి అధిగమించిందన్నారు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో అనేక సమస్యలను ఎదుర్కొని జోన్ స్థాయిలో రూ. 10,270 కోట్ల స్థూల ఆదాయాన్ని నమోదు చేసుకుందన్నారు. ఇదే సమయంలో 81 మిలియన్ టన్నుల సరుకును ఎగుమతిని చేయడంతోపాటు 284 మిలియన్ల ప్రయాణికులను రవాణా చేయడం జరిగిందన్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న 231కి.మీ నిడివిగల రైలు పట్టాల పునరుద్ధరణతోపాటు పూర్తి చేయడం జరిగిందన్నారు. రైళ్ల రాకపోకలకు ఎటువంటి ప్రమాదాలు తావులేకుండా సాఫిగా నడిచే విధంగా 85 లెవల్ క్రాసింగ్ గేట్‌లను తొలగించడం జరిగిందన్నారు. 44 ప్రధాన రైల్వేస్టేషన్‌లలో నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి 24 గంటలు నిఘా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వౌలిక వసతుల కల్పన విషయంలో 119 కి.మీ డబ్లింగ్, 14 కి.మీ కొత్త రైలు మార్గాలు పూర్తి చేయడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థులు వేసిన ఏకపాత్రాభియం చూపరులను ఎంతగానో ఆకర్షించాయి. చివరగా వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు, జాక్ అండ్ జిల్ విద్యార్థులకు డీఆర్‌ఎం చేతుల మీదుగా నగదు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎడీఆర్‌ఎం ఎంవీ రామరాజు, సుమన, సీనియర్ డీసీఎం భాస్కర్‌రెడ్డి, సీనియర్ డీఈఈ వెంకటరమణ, సీనియర్ డీపీఓ నహేమియా, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.