విజయవాడ

పేదలకు ఇళ్లస్థలాల పంపిణీపై నేడు సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 27: నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లస్థలాల పంపిణీకి సంబంధించి మంగళవారం అధికారులతో సమీక్ష జరపనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ కే మాధవీలత తెలిపారు. నగరంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగే రెవెన్యూ అధికారుల సమీక్షలో ఉపాధి హామీ అనుసంధానంతో నివేశన స్థలాల లేఅవుట్ల అభివృద్ధి, ప్రభుత్వ భూముల గుర్తింపు, భూసేకరణ, తదితర అంశాలపై సమగ్రంగా చర్చిస్తామన్నారు. జిల్లాలోని సబ్ కలెక్టర్లు, రెవెన్యూ డివిజనల్ అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, డ్వామా తదితర శాఖల అధికారులు విధిగా సమీక్షలో పాల్గొనాలని ఆమె తెలిపారు.

స్పందనలో 130 అర్జీలు
* సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 27: సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి సుమారు 130 అర్జీలను స్వీకరించినట్టు సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర తెలిపారు. వీటిలో ప్రధానంగా అర్బన్ హౌసింగ్ కింద 35, రూరల్ హౌసింగ్ కోసం 7, రేషన్ కార్డుల కోసం 21, పింఛన్ల కోసం 4, ఆధార్ కోసం 2, వీఎంసీకి సంబంధించి 7, తహశీల్దార్ల పరిధిలో పరిష్కారం కోసం 25, ఇతర సమస్యల పరిష్కారం కోసం 29 దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రజలు దాఖలు చేసుకున్న అర్జీల పరిష్కారం కోసం సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సివిల్ సప్లయిస్ హమాలీల సమస్యలు పరిష్కరిస్తాం
విజయవాడ (కార్పొరేషన్), జనవరి 27: రాష్ట్రంలోని సివిల్ సప్లయిస్ హమాలీ కార్మికుల పిఎఫ్ సమస్యలను పరిష్కరిస్తామని సివిల్ సప్లయిస్ పీఎఫ్ అధికారి నరశింహరావు హామీ ఇచ్చారు. సోమవారం నగరంలోని సివిల్ సప్లై డీఎం కార్యాలయంలో జరిగిన జిల్లా హమాలీ కార్మికుల, సివిల్ సప్లయిస్ అధికారుల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడుతూ హమాలీల సంక్షేమం కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు. హమాలీల పీఎఫ్ క్లైయిమ్‌లు, పెన్షన్లు ఎలా పొందాలి, కేవైసీ ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఫారం 10డి, ఫారం 5,6 లపై అవగాహన కల్పించారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ అధికారులు స్పందించిన తీరుపై అభినందనలు తెలుపుతూ నూతన అగ్రిమెంట్ ప్రక్రియను వేగవంతం చేయాలని, హమాలీల డిమాండ్ నోటీసులో పేర్కొన్న విన్నపాలను పరిష్కరించాలని కోరారు. ఏఎం అకౌంట్స్ డి సుజనా, ఎఎం జనరల్ సి సురేష్, అధికారులు లక్ష్మీవెంకటేశ్వరమ్మ, ఏఐటీయూసీ మేస్ర్తిలు వీరరాజు, సింహాచలం, డీ నాగేశ్వరరావు, వినోద్, క్రాంతి, శ్రీను, నరశింహరావు, తదితరులు పాల్గొన్నారు.