విజయవాడ

ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాథ్‌కు కేబినెట్ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీ నాథ్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హో దా కల్పించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్ర వీణ్ ప్రకాష్ ఆదివారం జీవో జారీ చేశా రు. శ్రీనాథ్ గత నవంబర్ 8న చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం రెండేళ్లు. జర్నలిజంలో అపార అనుభవం కలిగిన శ్రీనాథ్ వైఎస్సార్ క డప జిల్లా సింహాద్రిపురం మండలం కొవరంగుట్టుపల్లి గ్రామస్తులు. 4దశాబ్దాలకు పైగా కడపలో ఒక దినపత్రిక విలేఖరిగా పనిచేశారు. ఆ సమయం లో రాయలసీమ వెనుకబాటుకు సం బంధించి, రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై ‘సెవెన్ రోడ్స్ జంక్షన్’ పేరు తో ఆయన రాసిన కాలమ్స్ విశేష ప్రా చుర్యం పొందాయి. ఇక ఏపీయూడబ్ల్యుజే కడప జిల్లా అధ్యక్షుడిగా 24ఏ ళ్లు, రాష్ట్ర కార్యదర్శిగా రెండేళ్లు ఆయన పనిచేశారు. శ్రీనాథ్ వైఎస్‌ఆర్‌కు అత్యంత సన్నిహిత జర్నలిస్ట్ కూడా.