విజయవాడ

రంగా వర్గీయులు, అభిమానులు రంగంలోకి రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 16: బెజవాడలో కాంగ్రెస్ పార్టీ ఊపందుకుంటోందని దివంగత కాంగ్రెస్ పార్టీ నేత రంగా వర్గీయులు, అభిమానులు ఇక రంగంలోకి రావాలని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. బీజేపీ ఆటలు సాగవని కాంగ్రెస్ నాయకులు ఐక్యంగా ఉండాలని, ఢిల్లీలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ పాలనకు చరమగీతం పాడాలని ఆయన కాంగ్రెస్ శ్రేణులకు తెలిపారు. ఆదివారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఆకుల శ్రీనివాసకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకుల ఆత్మీయ సమావేశానికి శైలజానాథ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆకుల వర్గీయులు, ఆకుల శ్రీనివాసకుమార్ కొంత కాలం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారని రాష్ట్రంలోని పలువురు నాయకుల విధానాలు ఆకులను బాధించాయన్నారు. నేడు రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా సాకే శైలజానాథ్ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కొత్త ఊపు వచ్చిందని అందుకే ఆకుల మరోమారు ప్రత్యక్ష రాజకీయాలకు తెరపైకి వచ్చారని పలువురు బహిరంగంగా ప్రకటించారు. ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జీ క్రిస్ట్ఫోర్ తిలక్, ఏఐసీసీ కార్యదర్శి మెయప్పన్‌లు కాంగ్రెస్ నాయకుల్లో నూతనోత్సహం వెల్లువిరిసేలా ప్రసంగించారు. ఆకుల శ్రీనివాసకుమార్‌కి తాము అండగా నిలబడతామని కాంగ్రెస్ పార్టీనీ బలోపేతం చేయాలన్నారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, నగర అధ్యక్షులు వీ గురునాథం, పీసీసీ నాయకులు నరహరశెట్టి నరసింహారావు, మట్టా జేబ్ రత్నకుమార్, కొలనుకొండ శివాజీ, వీరంకి రామచంద్రరావు, తదితరులు పాల్గొన్న ఈ ఆత్మీయ సమావేశంలో కాంగ్రెస్ పార్టీలోకి అందరినీ రప్పిస్తామని, నాయకులను, కార్యకర్తలందరినీ వాడుకుంటానని తనదైన పంథాలో మాట్లాడిన సాకే శైలజానాథ్ అందరినీ ఆకట్టుకున్నారు. అయితే నగర మహిళా కాం్ర గెస్ అధ్యక్షురాలు జక్కుల ఇందిరను వేదికపైకి పిలవకపోవడం కాంగ్రెస్ నాయకుల్లో చర్చనీయాంశమైంది. శైలజానాథ్‌ని ముస్లిం మైనార్టీ వర్గాల నాయకులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అలాగే సీనియర్ నా యకులు కూడా ఆయనని సత్కరించారు. అనంతరం నాయకులకు, కార్యకర్తలకు ఆకుల శ్రీనివాసకుమార్ అల్పాహార విందును ఏర్పాటు చేశారు. భవానీపురం బ్యాంక్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆకుల శ్రీనివాసకుమార్ తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
నేడు కాంగ్రెస్ పార్టీ ధర్నా
ఎస్సీ, ఎస్టీ, రిజర్వేషన్లపై సుప్రీమ్ తీర్పు రాజ్యాంగ వ్యతిరేకమనీ దీనిపై ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17న గాంధీనగర్ సెంటర్‌లో ధర్నా నిర్వహిస్తున్నట్లు పీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఈధర్నాలో ఏపీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు తులసీరెడ్డి, షేక్ మస్తాన్‌వలీ, కార్యదర్శులు సిడీ మెయ్యప్పన్, క్రిస్ట్ఫోర్ తిలక్, తదితరులు పాల్గొంటారన్నారు.