విజయవాడ

విజ్ఞానంతో పాటు వినోదం ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (గాంధీనగర్) ఫిబ్రవరి 16: పిల్లలకు విజ్ఞానంతో పాటు వినో దం, వికాసం, సాంస్కృతిక అంశాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. సేవా భారతి విజయవాడ ఆధ్వర్యంలో బాలమేళా చిన్నారుల సాంస్కృతిక పోటీలు ఆదివారం సిద్ధార్థ ఆడిటోరియంలో జ రిగాయి. ముగింపు కార్యక్రమానికి ము ఖ్యఅతిథిగా విచ్చేసిన వెలంపల్లి మా ట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుండే విజ్ఞానంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలిజీ పట్ల అవగాహన కల్పించాల్సి న అవసరం ఉందన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక నూతన పథకాలను ప్రవేశపెట్టి ఉన్నతస్థాయి విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, తల్లిదండ్రులు ప్రభుత్వ విద్యా సంస్థలలోనే తమ పిల్లలను చదివించి ఉన్నతులుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న పీఎస్‌సీఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యక్షుడు చలవాది మల్లిఖార్జునరావు మాట్లాడుతూ చిన్నారులలోని సృజనాత్మక శక్తి ఇటువంటి వేదికల ద్వారా బయటపడుతుందన్నారు. విద్యార్థులకు చక్కని అంశాలు తెలియజేస్తూ మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా నేటితరం విద్యార్థులకు తెలియజేయాలన్నారు. సేవా భారతి సంస్థ పేద విద్యార్థులకు చేస్తున్న కృషిని అభినందించారు. సభకు అధ్యక్షత వహించిన సేవా భారతి అధ్యక్షుడు డాక్టర్ వై సాయికిషోర్ మాట్లాడుతూ 30ఏళ్లుగా సేవా భారతి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ట్యూషన్ ప్రతిరోజు సాయంత్రం నిర్వహిస్తున్నామని తెలిపారు. నగరంలో 33సెంటర్ల ద్వారా నిపుణులైన ఉపాధ్యాయులచే ఉచిత ట్యూషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మిత్రా ఆటో ఏజెన్సీస్ సీఈవో చెరువు శ్రీనివాస్, ఎక్కా చంద్రశేఖర్, వీవీఎస్ గ్రూప్ ఇండియా వేనేజింగ్ డైరెక్టర్ శేషయ్య, తదితరులు పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో విద్యార్థులచే ఏర్పాటు చేసిన సైన్సు విజ్ఞాన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.

ఆర్య వైశ్య సంక్షేమ, అభివృద్ధి సంస్థ
చైర్మన్‌గా ప్రసాద్ ప్రమాణ స్వీకారం
* హాజరైన మంత్రులు
విజయవాడ (గాంధీనగర్) ఫిబ్రవరి 16: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య సంక్షేమ, అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా కుప్పం ప్రసాద్ ప్రమాణ స్వీకార మహోత్సవం, స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం శంకర నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరావు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ బీ రామారావు, ఏపీ బీసీ సెల్ కార్పొరేషన్ ఫైనాన్స్ లిమిటెడ్ ఎండీ ఎం రామారావు, ఆర్యవైశ్య సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డీకే సంజయ్ ప్రభాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు, తదుపరి వాసవీ మాత జెండాను ఆవిష్కరించారు. సభలో పాల్గొన్న ముఖ్యఅతిథులు మాట్లాడుతూ సేవా తత్పరత కలిగిన వ్యక్తులుగా ఆర్యవైశ్యలకు ప్రత్యేకత ఉందని నమ్మిన వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అని, అధికారంలోకి వచ్చిన వెంటనే తగిన ప్రాధాన్యత ఇవ్వడం, మాట తప్పడు, మడమ తిప్పడు అనే దానికి ఇదే నిదర్శనమని వక్తలు పేర్కొన్నారు. మాటలతో కాకుండా చేతలతో చూపిన వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు రూ.100కోట్లు తక్కువ కాకుండా నిధులు విడుదలయ్యేలా ముఖ్యమంత్రిని కోరతామన్నారు. సమాజ సేవలో ఆర్యవైశ్యులు ముందుంటారని కొనియాడారు. ఏపీ రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన కుప్పం ప్రసాద్ మాట్లాడుతూ తాను ఆర్యవైశ్య కుటుంబాల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. తనను రాష్ట్ర ఆర్యవైశ్య సంక్షేమ, అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.