విజయవాడ

423వ ఉరుసు మహోత్సవ పోస్టర్ ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 18: కొండపల్లి గ్రామంలో హజరత్ సయ్యద్ షాహ్ బుఖారి ఉరుసు ఉత్సవానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తీసుకువచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఈ ఏడాది ఉరుసు ఉత్సవాలను ప్రత్యేకంగా జరపనున్నామన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వన్‌టౌన్ బ్రాహ్మణ వీధిలో తన కార్యాలయంలో ఉరుసు ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్, క్యాలెండర్‌ను ఆయన తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్చి 4,5,6న కొండపల్లిలో 423వ ఉరుసు మహోత్సవం జరగనుండడం సంతోషకర విషయమన్నారు. ఉరుసు ఉత్సవంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా పాలుపంచుకుంటుందని వెల్లడించారు. సీఎం జగన్‌ని ఈ ఉత్సవాలకు ఆహ్వానించడంతో పాటు ఆయనను తప్పక రావాల్సిందిగా కోరతామని చెప్పారు. ఉరుసు ఉత్సవ కమిటీ చైర్మన్ మొహమ్మద్ అల్త్ఫా రజా మాట్లాడుతూ ఈ ఏడాది ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.