విజయవాడ

స్ట్రాంగ్ రూమ్‌లతో సహా స్థానిక ఎన్నికలకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 18: నగర పాలక సంస్థకు జరుగబోవు 5వ సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు సిద్ధంగా ఉండాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పేర్కొన్నారు. ఈమేరకు ఎన్నికల నిర్వహణలో భాగంగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా మంగళవారం ఉదయం నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాల ఆవరణలోగల దేవయ్య ఆడిటోరియం, దాని పరిసరాలను పరిశీలించిన కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుతోపాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద అవసరమైన బారికేడ్లు, టేబుల్స్, భోజన ఏర్పాట్లు, తదితర అంశాలు, ప్రస్తుతం అక్కడ ఉన్న మరుగుదొడ్లు, అదనంగా మొబైల్ మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం తదితర చర్యలు చేపట్టాలన్నారు. ఇన్‌డోర్ స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా గుర్తించి స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు విద్యుత్ సౌకర్యం, సెక్యూరిటీ సిబ్బందికి కావాల్సిన వెయిటింగ్ రూమ్స్, ఏర్పాటు చేయాలన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్నిక నిర్వహణకు సంబంధించి విధులలో ఉన్న సిబ్బందికి ఎన్నిక సామగ్రి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కౌంటర్లను ఏర్పాటుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక అందించాలన్నారు. అనంతరం గాయత్రీ నగర్‌లో అన్ని అంతర్గత వీధులను పరిశీలించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పలుచోట్ల చెట్ల కొమ్మలు, చెత్త చెదారం ఉండటాన్ని గమనించి వాటిని తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఈపర్యటనలో సీఈ మరియన్న, సిటీ ప్లానర్ లక్ష్మణరావు, ఎస్‌ఈ జేవీ రామకృష్ణ, ఈఈ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.