విజయవాడ

అరబిందో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (గాంధీనగర్) ఫిబ్రవరి 20: శ్రీకాకుళం జిల్లా, పైడిభీమవరంలోని అరబిందో పరిశ్రమలో 16ఏళ్లుగా పనిచేస్తున్న 4500 మంది కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలనే స్పృ హ యాజమాన్యానికి లేదని, అత్యంత లాభాలు గడిస్తూ, కార్మికులను చిన్నచూపు చూస్తున్నారని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్ ఆవేదన వ్యక్తం చశారు. స్థానిక గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర ప్రభుత్వం వెం టనే అరబిందో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆల్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబు ల్ సమావేశం గురువారం జరిగింది. ఈసమావేశంలో పాల్గొన్న గఫూర్ మా ట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా అరబిందో కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్ల పరిష్కారానికై ఫిబ్రవరి 26న అన్ని జిల్లాలలోని కలెక్టర్ కార్యాలయాల వద్ద, అన్ని కార్మిక సంఘాల సంయుక్త ఆధ్వర్యం లో ధర్నాలు నిర్వహిస్తామని తెలిపా రు. ప్రతి సంవత్సరం అరబిందో సం స్థకు 2వేల కోట్లకు పైగా లాభం ఆర్జిస్తున్నా అందులో కార్మికుల సంక్షేమం కోసం కొంత భాగమైన ఖర్చు చేయడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా అక్కడ పనిచేస్తూ, నేటికీ అతితక్కువ దినసరి వేతనాలతో దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారని వాపోయారు. భద్రతా చర్యల లోపంతో, పరిశ్రమలో జరిగిన ప్రమాదాలలో కార్మికులు అనేక మంది చనిపోతున్నారని, పరిశ్రమ నుండి వెలువడే విషవాయువులు పీల్చుకుని పనిచేయడం వలన కార్మికుల జీవితకాలం తగ్గిపోతోందని వివరించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచమని కార్మికులు అడిగితే దానిని నేరంగా భావించిన అరబిందో యాజమాన్యం కార్మికులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. రాష్టవ్య్రాప్తంగా పరిశ్రమల, వివిధ రకాలుగా పనిచేస్తున్న 50లక్షల మంది కార్మికులకు కనీస వేతనాలు లేవని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం తక్షణం అరబిందో యాజమాన్యంపై తగిన చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ ప్రభుత్వాలను అనుసరించి పరిశ్రమల యాజమాన్యాలు నడుస్తున్నాయని విమర్శించారు. ఈనెల 26న జరిగే ధర్నా కార్యక్రమాలకు కార్మికులు కుటుంబంతో సహా పాల్గొని తమ నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ఇది ఒక్క అరబిందో కార్మికుల సమస్య కాదని, రాష్ట్రంలోని కార్మికులందరి సమస్య అన్నారు. అన్ని ట్రేడ్ యూనియన్లు ఈసమస్యను ఉమ్మడిగా ఎదుర్కొవాలని సూచించారు. ప్రభుత్వ విధానాలు యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ, చట్టాలు యాజమాన్యాలకు చుట్టాలుగా ఉన్నాయని, కార్మికులకు అనుకూలంగా లేవన్నారు. కార్మికులు చట్ట వ్యతిరేకమైన కోర్కెలు కోరడం లేదని, పని భద్రత, ఈఎస్‌ఐ, కనీస వేతనం వంటి న్యాయమైన, చట్టబద్దమైన కోర్కెలు అడుగుతున్నారని తెలిపారు. కార్మికుల సమస్యలను ఎదుర్కోవడానికి, కార్మిక సంఘాలన్ని ఐక్యం కావాలని సూచించారు. 26న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని కోరారు. ఈకార్యక్రమంలో వివిధ కార్మికసంఘాల నాయకులు ఎం ఉమామహేశ్వరి, ఐ వేమేశ్వరీ, సుబ్బయ్య, సుధీర్, పీవీ సుందరరాజు, తదితరులు పాల్గొన్నారు.