విజయవాడ

దేవాదాయ శాఖ మంజూరు చేసిన నిధులపై తర్జన భర్జన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 20: పాతబస్తీలోని నగరాల దేవస్థానాల అ భివృద్ధికి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మం జూరు చేయించిన రూ.2కోట్ల నిధులు వరమా? శాపమా? తేల్చుకోలేని స్థితి లో నగరాల సంఘాల నాయకుల్లో అంతర్మథనం జరుగుతోంది. తర్జనభర్జనల అనంతరం గురువారం నగరాల మహాలక్ష్మీ ఆలయ ప్రాంగణంలో ము ఖ్య నేతలు సమావేశమయ్యారని విశ్వసనీయ సమాచారం. నగరాల దేవస్థానాలు దేవాదాయ ధర్మాదాయ శాఖలో విలీనం కాకుండా నాయకులు ఇన్నా ళ్లూ కాపాడుతూ వచ్చారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఆనాటి మంత్రి దివంగత ఎంకే బేగ్, దివంగత దేవినేని నెహ్రూ, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, ప్రస్తుత మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఇలా అందరూ దేవాలయాలను దేవాదాయశాఖ డేగ కన్ను నుండి తప్పించిన వారే. దాంతో రాజకీయాల కు అతీతంగా అందరూ నగరాల దేవస్థానాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా అండగా నిలబడిన వారే. అయి తే వెలంపల్లి వైకాపా తరపున పోటీలో ఉండగా ఆయన ప్రత్యర్థిగా వెలంపల్లి ని ఓడించాలనే వ్యక్తిగత ద్వేషంతో ఎ న్నికల బరిలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కోరాడ విజయకుమార్‌కి కొ మ్ము కాసిన నగరాల దేవస్థాన పాలకవర్గం అధ్యక్షుడు పోతిన బేసికంఠేశ్వరుడు మరి కొందరు ఆనాడు వెలంపల్లి కి మింగుడు పడలేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే విషయాన్ని రుజువు చేస్తూ వెలంపల్లి ఆనాడు తనకు వెన్నుపోటు పొడవాలని చూసిన వారందరికీ నేడు ఆప్తుడయ్యాడు. స్వయంగా నగరాల దేవస్థానాల అభివృద్ధికి సహకరిస్తూ ని ధులు మంజూరు చేయడంతో నగరా ల కులస్థుల్లో మంత్రి హీరో అయ్యా డు. పైగా గతంలో మూడేళ్ల ప్రభుత్వ మినహాయింపుని ఈ ఏడాది ఐదేళ్ల కా ల పరిమితిగా మంత్రి పెంచారు. అదే విధంగా దేవస్థానం పునర్నిర్మాణం కో సం రూ.2కోట్లు మంజూరు చేశారు. న గరాల సంఘ నాయకులందరూ ఆయనను బుధవారం అభినందించిన విష యం విదితమే.