విజయవాడ

జిల్లాలో తొలి విడతగా 1237 పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 22: రాష్ట్రానికే విద్యాహబ్‌గా ఉన్న కృష్ణా జిల్లాను నాడు - నేడు కార్యక్రమం అమల్లో మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం నాడు - నేడు కార్యక్రమం పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మనబడి - నాడు-నేడు కింద జిల్లాలో 1237 పాఠశాలల్లో 9 రకాల వౌలిక సదుపాయాలు కల్పించేందుకు గుర్తించడం జరిగిందన్నారు. జిల్లాలో సుమారు 3వేల పైన ప్రభుత్వ పాఠశాలలు ఉండగా నాడు - నేడు కింద మొదటి విడత 1100 పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించవలసి ఉన్నప్పటికీ అదనంగా మరిన్ని పాఠశాలను తీసుకుని పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 586, సర్వశిక్షాభియాన్ ద్వారా 333 ఏపీడబ్ల్యు ఐడీసీ ద్వారా 254, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ ద్వారా 64 పాఠశాలల్లో, వౌలిక సదుపాయాలు కల్పించేందుకు బాధ్యతలు అప్పగించామన్నారు. జిల్లాలో నాడు - నేడు కార్యక్రమం ఎంత మాత్రం వెనుకబడి ఉండేందుకు వీలులేదని ఆయన స్పష్టం చేశారు. మొదడి విడతలో గుర్తించిన పాఠశాలల్లో ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లకు నీటి సౌకర్యం కల్పించడం, లేని చోట్ల కొత్తవి నిర్మించడం, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, ఫర్నిచర్, రంగులు వేయడం,