విజయవాడ

విద్యార్థులు ఆల్‌రౌండ్ నైపుణ్యాలు సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 22: విద్యార్థులు ఆల్‌రౌండ్ నైపుణ్యాల్ని పెంపొందించుకుని ఉన్నత స్థానానికి ఎదగాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. వన్‌టౌన్‌లోని పొట్టి శ్రీరాములు చలవాది మల్లిఖార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల 12వ వార్షికోత్సవ వేడుకలు శనివారం కళాశాల ఆవరణలో జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి వెలంపల్లి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలనుకుంటే క్రమశిక్షణ, అకుంఠిత, దీక్ష కలిగి ఉండాలన్నారు. విద్యార్థులు నిరంతరం పట్టుదల, కృషి, ప్రణాళికాబద్ధంగా చదివితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని తెలిపారు. విద్యతోపాటు క్రీడలు, సామాజిక, సాంస్కృతిక అంశాల్లో కూడా ప్రావీణ్యత పెంచుకుంటనే ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కళాశాల కార్యదర్శి రావూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ తమ కళాశాలలో కోర్సు పూర్తయ్యేలోగా విద్యార్థులకు ఉపాధి లభించాలనే ఉద్దేశంతో తీర్చిదిద్దుతున్నామన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు సాఫ్ట్ స్కిల్స్, పలు అంశాల పట్ల అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. కళాశాల అధ్యక్షులు చలవాది మల్లిఖార్జునరావు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతోపాటు సృజనాత్మకతతో కూడిన విద్యను అందించేందుకు కళాశాల కృషి చేస్తుందన్నారు. సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే నాగేశ్వరరావు వార్షిక నివేదికను అందించారు. ఈ సందర్భంగా బిటెక్, ఎంబీఏ, పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రతిభావంతుమైన విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినీ విద్యార్థులచే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్య సభ్యులు, వివిధ శాఖాధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.