విజయవాడ

అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు దేశీయ పరిశ్రమలకు మరణశాసనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (గాంధీనగర్), ఫిబ్రవరి 22: అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో మన దేశంలో పర్యటించనున్న నేపథ్యంలో భారత్‌తో పలు వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా కోడిమాంసం, పాల ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని కేంద్రం యోచిస్తోందని, ఇది దేశంలో కోళ్ల పరిశ్రమ, పాడి పరిశ్రమకు మరణ శాసనమే అవుతుందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏపీ రైతు సంఘం ఆధ్వర్యాన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రైతు సంఘాల నాయకులు పలు అంశాలపై చర్చించారు. ఈసందర్బంగా ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, మాజీ మంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ మన దేశంలో కోట్లాది మంది రైతులు డెయిరీ, పౌల్ట్రీ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. రైతుల ఆమోదం లేకుండా ప్రభుత్వం ఆయా రంగాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని డిమాండ్ చేశారు. ఈ నెల 24న లెనిన్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ ఒప్పందం జరిగితే దేశంలోని నాలుగు కోట్ల మంది ఆధారపడి ఉన్న కోళ్ల పరిశ్రమ తీవ్ర నష్టాలకు గురవుతుందని, మూడు కోట్ల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. అమెరికా కోడి మాంసం మన మార్కెట్లోకి ప్రవేశిస్తే కోళ్ల పరిశ్రమతో పాటు మొక్కజొన్న, సోయా చిక్కుడు, మెట్ట ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోతారని వాపోయారు. అదేవిధంగా పాడి పరిశ్రమ కూడా దెబ్బతింటుందన్నారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు జరగకుండా రైతులు ఐక్యంగా పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సి ఉందని, 24న జరిగే ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు సంఘాల నాయకులు ఆర్ వెంకయ్య, బుచ్చారామ్, కొల్లా రాజమోహన్, జమలయ్య, జె రామారావు, సుంకర రాంబాబు, చింతమనేని కృష్ణారావు, పి నరశింహరావు పాల్గొన్నారు.