విజయవాడ

ప్లాస్టిక్‌పై నిషేధం అమలు ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ పశ్చిమ, ఫిబ్రవరి 22: నగరంలో ప్లాస్టిక్ భూతాన్ని అధికారులు పూర్తిస్థాయిలో తరిమికొట్టలేక పోతున్నారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ లక్ష్యానికి తూట్లు పడుతున్నాయి. మున్సిపల్ అధికారులు రికార్డుల్లో చూపించడానికే అన్నట్లుగా ప్లాస్టిక్ అమ్మకాల స్థావరాలపై తూతూమంత్రంగా దాడులు నిర్వహిస్తున్నారు. తరువాత సర్దుబాటు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నగరంలో మురుగు కాలువల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలే అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి. సుమారు ఆరు నెలల క్రితం పాతబస్తీలోని ప్లాస్టిక్ వ్యాపార స్థావరాలపై వరుసగా దాడులు నిర్వహించారు. తరువాత అంతా సర్దుకున్నారు. మూడురోజుల క్రితం తాము ఉన్నామని వ్యాపారులకు గుర్తు చేయడానికి అన్నట్టుగా గొల్లపూడిలోని మహాత్మాగాంధీ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ప్లాస్టిక్ అమ్మకాలపై దాడులు నిర్వహించారు. మిగతా వారంతా షాపులు మూసేసి తాళాలు వేసి పరారయ్యేంత సమయమిచ్చారు. దాంతో మిగతా వ్యాపారులు చల్లగా జారుకున్నారు. దీంతో ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రించి ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను నిలపాలనే ధ్యేయానికి తూట్లు పడుతున్నాయి. ఇంతకాలం ప్లాస్టిక్ వాడాలంటే అమ్మకందారులు, వినియోగదారులు భయపడ్డారు. అధికారులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధానికి పట్టుదలతో పాటుపడ్డారు. కానీ నేడు నగరంలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యాపారాలు భారీగా పెరిగాయి. వాటిపై నియంత్రణ, నిఘా కరువైంది. పూలు, పండ్లు, మిఠాయిలు, చివరకు కొబ్బరికాయలు, పుచ్చకాయలు కూడా క్యారీ బ్యాగుల్లోనే తరలిస్తున్నారు. క్యారీ బ్యాగ్‌ల వాడకాన్ని నియంత్రించలేని అధికారులు చేతులెత్తేశారని పలువురు విమర్శిస్తున్నారు. కాలువల్లో పూడిక తీసిన సిల్ట్‌లో 75శాతం ప్లాస్టిక్ వ్యర్థాలే బయట పడుతున్నాయి. గతంలో మురుగు కాలువల్లో చెత్తాచెదారంతో పాటు వాడిపారేసిన కొబ్బరి బొండాలు ఎక్కువగా ఉండేవి. నేడు వాటి స్థానంలో క్యారీబ్యాగ్‌లు, ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడుతున్నాయి. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.