విజయవాడ

ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్ వ్యతిరేకంగా భారీ కొవ్వొత్తుల ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఫిబ్రవరి 23: ప్రజల సహనానికి కేంద్ర ప్రభుత్వం పరీక్ష పెడుతోందని, ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్ వంటి ప్రజా వ్యతిరేక నల్లచట్టాలు రద్దు చేసేవరకు, నిరసన గళం కేంద్రాన్ని తాకేవరకు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. కానూరు పరిధిలోని సనత్‌నగర్ నందు ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్, సీఏఏ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో శాంతి బాగ్ ఉద్యమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే బోడే ఆధ్వర్యంలో అదివారం భారీ కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. న్యూ పంటకాలువ రోడ్డులోని లైఫ్ స్టైల్ షోరూం నుండి శాంతి బాగ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సంఘీభావం తెలిపి అనంతరం జరిగిన సభలో బోడే మాట్లాడుతూ మన హక్కులను మనం కాపాడుకుందాం అని అన్నారు. హక్కులను కాలరాస్తే సహించేది లేదన్నారు. తాతదండ్రుల దగ్గర నుండి పుట్టి పెరిగిన పౌరసత్వాన్ని నిరూపించుకోవటం అంటే అధికార మదంతో చేస్తున్న చేష్టలని ఆయన విమర్శించారు. అధికారం ఉంది కదా అని ప్రజలను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టలేదని బోడే జోస్యం చెప్పారు. ప్రజలు ప్రభుత్వాలకు బుద్ది చెప్పే సమయం రానుందన్నారు. ఈకార్యక్రమంలో గద్దె అనూరాధ, దోనేపూడి రవికిరణ్, జమాతె ఇస్లామీ హిందూ అధ్యక్షుడు ముజాద్ ఖాన్ ఉమ్రి, మహమ్మద్ ఇబ్రహీం, ముజాద్ అహమ్మద్, అబ్దుల్ గుల్జార్ బాయ్, సుబ్లీబాయ్, షేక్ బుజ్జి, బాషా, హబీబ్ ఖాన్, మస్తాన్ బాషా, హబీబ్ బాయ్ పాల్గొన్నారు.

అమరావతినే రాజధానిగా కొనసాగించాలి
విజయవాడ (గాంధీనగర్) ఫిబ్రవరి 23: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అయోధ్యనగర్ లోటస్ ల్యాండ్‌మార్క్ వద్ద ఆదివారం వౌనదీక్ష నిర్వహించారు. ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కే సుబ్బరాజు, అనేక మంది స్థానికులు వౌన దీక్షలో పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా కావాలని కోరుతూ, ఆంధ్రులంతా ఒక్కటే, రాజధాని అమరావతి ఒక్కటే ఉండాలని ప్లకార్డులను చేతపట్టుకొని వౌనంగా నిలబడ్డారు.