విజయవాడ

అన్న క్యాంటీన్ల మూసివేత చారిత్రక తప్పిదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పటమట, ఫిబ్రవరి 23: పేదల ఆకలితీర్చే అన్న క్యాంటీన్ల మూసివేసి జగన్ ప్రభుత్వం చారిత్రక తప్పిదం చేసిందని, అన్న క్యాంటీన్ల వలన రోజువారీ కార్మికులు, బడుగు బలహీన వర్గాల వారు తమ ఆకలి తీర్చుకునేవారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. నియోజకవర్గం సమస్యల పరిష్కారంలో భాగంగా ఆదివారం ఆయన పటమట 12వ డివిజన్ రామాలయం తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకాపాకి చెందిన వడ్డీ వ్యాపారుల చేతిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రేమ్‌కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని గద్దెను కోరారు. పొట్టకూటి కోసం ఇక్కడకు వచ్చిన బీహార్ వలస కూలీలు తమకు ఓటు హక్కు కల్పించాలని కోరారు. పేదల కడుపు నింపుకోవటం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లు మూసివేసి ఆ భవనాలను గ్రామ సచివాలయాలుగా మార్చటం వైకాపా నియంతృత్వ పోకడకి నిదర్శనమన్నారు. పేదలకు పట్టెడన్నం పెట్టడం కన్నా రాజకీయ పరమార్థం ఏముంటుందని అన్న ఎన్టీఆర్ మాటల స్ఫూర్తితో చంద్రబాబు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే వైకాపా ప్రభుత్వం కక్షసాధింపుతో అన్న క్యాంటీన్లు మూసివేసిందన్నారు. పేదప్రజలు కడుపుకొట్టిన వైకాపా ప్రభుత్వానికి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.
అన్న క్యాంటీన్లు తెరవాలని నిరసన
మూసివేసిన అన్న క్యాంటీన్లు తిరిగి వెంటనే తెరవాలని కోరుతూ ఆదివారం ఉదయం 9గంటలకు 16వ డివిజన్ సిమెంటు గోడౌన్ వద్ద అన్న క్యాంటీన్ వద్ద అట్లు వేసి నిరసన తెలియజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు యలమంచిలి దేవేంద్రరరావు, ఊకోటి శేషగిరిరావు, చెన్నుపాటి గాంధీ, ముమ్మనేని ప్రసాద్, కర్ణా కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.