విజయవాడ

కాల్వగట్ల ఇళ్లను తొలగిస్తే సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 23: అండగా ఉంటానని మాయమాటలతో మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ తదుపరి సంక్షేమ లబ్ధిని రద్దు చేస్తూ ప్రజలను ఇబ్బంది పాల్జేస్తున్న వైనం గర్హనీయమని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆదివారం ఉదయం 1వ డివిజన్ గుణదల పరిసర ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాల్వగట్లపై ఇల్లున్న వారి ఇళ్లను తొలగిస్తామని ప్రకటనలు చేయడం జగన్ రాక్షస పాలనకు నిదర్శనమన్నారు. సెంట్రల్ పరిధిలోని ఏ కాల్వగట్లపై ఉన్న ఏ ఒక్క ఇంటినైనా కూల్చితే తెలుగుదేశం పార్టీ సహించదని, ప్రజల తరఫున ప్రత్యక్ష పోరాటం చేసి నిరంకుశ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కాల్వగట్ల ఇళ్ల తొలగింపుపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను గుర్తించి ఆ ప్రక్రియను మానుకోవాలని హితవుపలికారు. ఈకార్యక్రమంలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు గోరంట్ల శ్రీను, కార్యదర్శి సాయమ్మ, నాని, రత్తయ్య, సత్యం మురళి, తదితరులు పాల్గొన్నారు.

సీనియర్ రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ చాంప్ కృష్ణా
* రన్నరప్‌గా గుంటూరు * వ్యక్తిగత సింగిల్స్ చాంప్ సుహృద్, అనూష
విజయవాడ (ఎడ్యుకేషన్), ఫిబ్రవరి 23: స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ సహకారంతో ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్, కృష్ణా జిల్లా సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ సీనియర్ రాష్టస్థ్రాయి సాఫ్ట్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ఆదివారంతో ముగిసింది. టీమ్ విభాగంలో కృష్ణా పురుషుల, మహిళల జట్లు చాంపియన్‌గా నిలువగా గుంటూరు, శ్రీకాకుళం జట్లు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. వ్యక్తిగత పురుషుల సింగిల్స్ విభాగంలో కే సుహృద్ అమ్రు ప్రథమ, ఎస్ వీహీత్ ద్వితీయ, ఎం యుధీర్ తృతీయ స్థానాలు సాధించగా మహిళల సింగిల్స్ విభాగంలో ఎన్ అనూష, ఎస్ యశస్వి, పీ యుతికాలు మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ మరియు ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ పరిశీలకుడు ఏ మహేష్‌బాబు పాల్గొని విజేతలకు ట్రోపీలను, సర్ట్ఫికేట్స్, మెడల్స్‌ను అందజేశారు. ఈసందర్భంగా విజేతలను రాష్ట్ర సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లే శ్రీనుబాబు అభినందించారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర సంఘ ప్రధానకార్యదర్శి దారం నవీన్‌కుమార్, కోశాధికారి అబ్దుల్ కరీమ్, కార్యనిర్వహక కార్యదర్శి కెడీ ప్రసన్నబాబు, టెన్నిస్ కోచ్ వై శివరామకృష్ణ, బాస్కెట్‌బాల్ కోచ్ ఎస్ సంతోష్‌కుమార్, ఎస్ శ్రీనివాసరావు, వివిధ జిల్లాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర జట్లను శాప్ పరిశీలకులు మహేష్‌బాబు ప్రకటించారు. ఎంపికైన జట్లు జాతీయస్థాయిలో అద్భుత ప్రతిభ చూపి రాష్ట్రానికి పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.