విజయవాడ

వైభవంగా రథోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, ఫిబ్రవరి 23: హర హర మహాదేవ శంభోశంకర అంటూ భక్తులు సృష్టి, స్థితి, లయకారకుడైన పరమేశ్వరుని కీర్తిస్తుండగా స్వామి రథోత్సవ ఊరేగింపు వైభవోపేతంగా జరిగింది. ఆదివారం సాయంత్రం శ్రీ కన్యక పరమేశ్వరీ అన్న సత్రం కమిటీ ఆధ్వర్యంలో పాతబస్తీ కెనాల్‌రోడ్‌లో స్వామి రథోత్సవ ఊరేగింపునకు భక్తులు అధికంగా వచ్చారు. మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా సాయంత్రం సంధ్య సమయంలో శుక్రవారం రాత్రి లోక క్షేమం కోసం అఖండకోటి భక్తుల చేత కల్యాణం చేయించుకున్న ఆదిదంపతులు ఆదివారం సాయంత్రం సర్వ ఆభరణాలను ధరించి భక్తకోటికి దివ్య దర్శనం ఇచ్చేందుకు రథాన్ని అధిష్టించి నగరోత్సవానికి బయలు దేరారు. ఈ అపూర్వమైన దృశ్యాన్ని చూసి తరలించేందుకు భక్తులు సాయంత్రం ఊరేగింపునకు పోటెత్తారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, శ్రీ వసంతమల్లిఖార్జునస్వామి దేవస్థానం నుండి ఉత్సవ మూర్తులను పల్లకిలో ఉంచి ఊరేగింపుగా శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్ధానానికి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఈ మూడు దేవస్ధానాలకు చెందిన ఉత్సవ మూర్తులకు ప్రధాన అర్చకుడు రాచకొండ సుమంత్‌శర్మ ఆధ్వర్యంలో అర్చకులు రాచకొండ నాగరాజుశర్మ, రాఘవేంద్రశర్మ చేత ప్రత్యేక పూజలు చేయించి పల్లకిలో ఉంచి ముందుభాగంలో మేతళాళలతో ఊరేగింపుగా తీసుకొచ్చి కెనాల్‌రోడ్‌లోని రథంలో ఉంచారు. శ్రీ కన్యక పరమేశ్వరీ అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు రథోత్సవ ఊరేగింపునకు నగర పోలీస్ కమిషనర్ ద్వారగాతిరుమలరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా, రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి రథోత్సవ ఊరేగింపును ప్రారంభించారు. రథం ముందు భాగంలో మహిళ భక్తుల కోలాటం, సంకీర్తన, భజనలు, పులి వేషాలు, భూత బేతాళాలు, ఆధ్యాత్మిక ప్రసంగం కళకారులు ప్రదర్శిస్తుండగా స్వామి రథం బయలు దేరింది. కెనాల్‌రోడ్‌లో ప్రతి సెంటర్‌లో భక్తులు స్వామికి అఖండ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. రథం సెంటర్ నుండి కెనాల్‌రోడ్ వినాయకుడి వరకు సాగింది. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం తిరిగి కెనాల్‌రోడ్ కుడివైపుగుండా స్వామి రథోత్సవ ఊరేగింపు బయలు దేరి తిరిగి యథాస్థానానికి చేరుకుంది. తొలుత దుర్గగుడి ఈవో ఎంవీ సురేష్‌బాబు, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో సీహెచ్ హేమలతాదేవి, దుర్గగుడి సహాయ ఈవోలు సుధారాణి, రమేష్, బీ వెంకటరెడ్డి, సహాయ ఇంజనీర్ రమాదేవి చేత అర్చకులు ప్రత్యేక పూజలను సత్రం కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు బీ హరేశ్వరరావు, లక్ష్మీ ప్రసాద్ చేయించిన అనంతరం వీరికి సత్కరించారు. ఈకార్యక్రమానికి మాజీ మేయర్ జంధ్యాల శంకర్, సత్రం కమిటీ ఉపాధ్యక్షులు డీ శంకరరావు, కాజాలక్ష్మీవెంకట మోహనరావు, తదితరులు విచ్చేశారు.