విజయవాడ

అక్రమ నిర్మాణాలకు ఏసీబీ సెగ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 25: ఇటీవల ఏసీబీ తనిఖీల్లో అక్రమ నిర్మాణంగా గుర్తించిన భవనాల తొలగింపునకు వీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు శ్రీకారం చుట్టారు. నగర పరిధిలోని శ్రీరామచంద్ర నగర్‌లో స్టిల్ట్, పార్కింగ్, గ్రౌండ్, 3 అంతస్తుల భవన నిర్మాణానికి ప్లాన్ అనుమతులు తీసుకుని అదనంగా నిర్మించిన నాలుగో అంతస్తును అక్రమ నిర్మాణంగా గుర్తించారు. ఈ అనధికార నిర్మాణానికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించాలంటూ యజమానికి నోటీసులు జారీ చేశారు. అందుకు స్పందించని యజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ నిర్మాణాన్ని తొలగించినట్టు సిటీ ప్లానర్ ఏ లక్ష్మణరావు తెలిపారు. నగర పరిధిలో అనధికార నిర్మాణాలను ఎట్టిపరిస్థితిలోనూ అనుమతించేది లేదని, అలాంటి నిర్మాణాలను గుర్తిస్తే తొలగిస్తామని హెచ్చరించారు. యజమానులు తప్పనిసరిగా ప్లాన్ తీసుకుని అందుకనుగుణంగానే నిర్మాణాలు చేపట్టాలని ఆయన సూచించారు.

మార్చిలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం గృహాల నిర్మాణాలు పూర్తిచేయాలి
* కమిషనర్ ప్రసన్న వెంకటేష్
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 25: జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకంలో నగరంలో నిర్మిస్తున్న జీ ప్లస్ త్రీ పక్కా భవనాలను మార్చి రెండో వారంలోగా పూర్తిచేయాలని వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు. మంగళవారం ఉదయం అజిత్‌సింగ్‌నగర్, కబేళా, రాజరాజేశ్వరీపేట, జక్కంపూడి ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న భవనాల పురోగతిపై తన ఛాంబర్‌లో చర్చించారు. వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. సింగ్‌నగర్‌లో 1920, రాజరాజేశ్వరీపేటలో 192, కబేళా ప్రాంతంలో 384, జక్కంపూడిలో 640 యూనిట్ల నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వివరించారు. ఇందుకు స్పందించిన కమిషనర్ ప్రసన్న వెంకటేష్ గృహాల నిర్మాణాలతో పాటు వౌలిక సదుపాయాల కల్పన కూడా వేగవంతం చేసి త్వరితంగా పూర్తిచేయాలన్నారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం మార్గదర్శకాలను అనుసరించి వివిధ ప్రదేశాల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించిన ఆక్రమణదారులకు పునరావాసం కింద ఈ గృహాలను కేటాయించాల్సి ఉందన్నారు. లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేయాలని పట్టణ ప్రణాళిక, యూసిడీ అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో సీఈ డీ మరియన్న, ఈఈ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.