విజయవాడ

29వేల మంది నగర వాసులకు రాజధాని గ్రామాల్లో స్థలాలు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 25: నగరంలో ఇళ్లులేని నిరుపేదలకు స్థలాలను అందజేసేందుకు రాజధాని గ్రామాల్లోని భూమిని ఎంపిక చేశారు. నగర పరిధిలో స్థలాల కొరత ఉన్నందున వీరికి అన్ని హంగులతో కూడిన స్థలాలను పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయించటం తెలిసిందే. నగరంలో సుమారు 85వేల మందిని అర్హులుగా గుర్తించగా, వీరందరికీ నగరంలో అనువైన భూమి అందుబాటులో లేకపోవడంతో రాజధాని గ్రామాల్లోని వేలాది ఎకరాల్లో కొంత భూమిని పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజధాని గ్రామాలైన ఐనవోలు, కృష్ణాయపాలెం, కురగల్లు, నిడమర్రు, మందడంలో సుమారు 28వేల 952 మందికి కుటుంబానికి సెంటు అంటే 48గజాల స్థలాన్ని పంపిణీ చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. భూముల గుర్తింపు, లేఅవుట్ల అభివృద్ధి తదితర పనులకు సీఆర్డీఏ మెరుగులు దిద్దుతుండగా, లబ్ధిదారులకు అవసరమైన వౌళిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఐనవోలులో 53.1007 ఎకరాలు, కృష్ణాయపాలెంలో 63.186 ఎకరాలు, కురగల్లులో 38.3062 ఎకరాలు, నిడమర్రులో 332.9436 ఎకరాలు, మందడంలో 169.31 ఎకరాల భూమి ఇళ్లస్థలాలకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఉగాది పండుగ నాటికి ఇళ్లస్థలాలు పంపిణీ చేయనుంది. నగరానికి చెందిన వారిని జిల్లా కాని జిల్లాకు తరలించడం వల్ల జీవనోపాధి దెబ్బతినడమే కాకుండా సామాజికంగా అనేక ఇబ్బందులకు గురవుతారంటూ విపక్షాలు, పలు ప్రజాసంఘాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ రైతులు ఉద్యమిస్తున్న ప్రస్తుత తరుణంలో బెజవాడ వాసులను ఆ గ్రామాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. లబ్ధిదారులు ఆయా ప్రాంతాలకు తరలివెళ్లేందుకు ఎంతవరకు సంసిద్ధవౌతారన్న విషయంపై కూడా సందేహాలు వ్యక్తవౌతున్నాయి.

జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు
రాములు ఆకస్మిక తనిఖీలు
* వసతుల కల్పనలో అధికారుల అలసత్వంపై ఆగ్రహం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 25: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కే రాములు మంగళవారం నగరంలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. నగర పరిధిలోని ఎస్సీ కాలనీలు, ప్రజలకు అందిస్తున్న వౌలిక సదుపాయాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. అధికారుల అలసత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2వ డివిజన్ మాచవరంలో ఎస్సీ కాలనీ పరిసరాలను పరిశీలించిన ఆయన ఇటీవల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటులో నెలకొన్న వివాదంపై స్థానికుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. తొలుత మాచవరంలో ఆంజనేయస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 45లక్షల రూపాయల వ్యయంతో స్థానికంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌కు డ్రైనేజీ, విద్యుత్, మంచినీటి సదుపాయాలు కల్పించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ హాల్‌కు ఏసీ సదుపాయం లేకపోవడాన్ని అధికారులను ప్రశ్నిస్తూ అసంపూర్తి నిర్మాణంపై కాంట్రాక్టర్‌ను తక్షణం బ్లాక్‌లిస్టులో పెట్టాలని ఆదేశించారు. కమ్యూనిటీ హాల్ వెనుక వైపు ఉన్న 500 చ.అ స్థలంలో కాలనీ నుంచి మురుగునీరు చేరి కాలనీ వాసులను రోగాల బారిన పడుతుండటాన్ని గుర్తించారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఎస్సీ సంక్షేమం కోసం ప్రభుత్వం సబ్‌ప్లాన్ కింద అమలు చేస్తున్న పథకాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఎస్సీల ఆర్థికాభివృద్ధి, సామాజిక అభ్యున్నతికి తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని రాములు హెచ్చరించారు. పర్యటనలో జిల్లా రెవెన్యూ అధికారి ఏ ప్రసాద్, వీఎంసీ అదనపు కమిషనర్ మోహనరావు, మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు, స్థానిక తహశీల్దార్ పాల్గొన్నారు.