విజయవాడ

ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: జిల్లాలో మార్చి 4నుండి 23వరకు నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలు లక్షా 12వేల 923మంది విద్యార్థులు రాసేందుకు అనువుగా 147 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లపై విద్యా, వైద్య, పోలీస్, రెవెన్యూ, పోస్టల్, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. మార్చి 4నుండి 23వరకు ఉదయం 9నుండి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలకు 61,625, రెండో సంవత్సరం పరీక్షలకు 51,398 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. ఇందుకు పట్టణ ప్రాంతంలో 80, గ్రామీణ ప్రాంతంలో 67 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా జంబ్లింగ్ పద్ధతిలో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. పరీక్షల కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ఫిబ్రవరి 29, మార్చి 1, 2 తేదీల్లో జిల్లాకు చేరుకుంటుందని, వాటిని ఆయా కేంద్రాలకు తరలించేందుకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసి ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనువుగా ఫర్నిచర్, విద్యుత్, మంచినీరు, పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇంతియాజ్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఏ ప్రసాద్, ఆర్‌ఐఓ పి రవికుమార్, డీఎంహెచ్‌ఓ టీఎస్‌ఆర్ మూర్తి, డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అందరికీ సురక్షిత తాగునీరు అందించాలి
* జలజీవన్ మిషన్ బృందం సూచన
కంకిపాడు, ఫిబ్రవరి 25: ప్రతిఒక్కరూ సురక్షితమైన తాగునీటిని తీసుకోవటం వల్ల అనేక వ్యాధుల నుంచి బయటపడవచ్చని జలజీవన్ మిషన్ కేంద్ర బృందం ప్రతినిధులు సామా, అవినాష్, జూష్టూ అన్నారు. మండలంలోని పునాదిపాడు గ్రామంలో కేంద్ర బృందం ప్రతినిధులు మంగళవారం పర్యటించారు. గ్రామ పంచాయతీ వలంటీర్లు, గ్రామస్తులు, మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో క్షేత్రస్థాయి సిబ్బంది అధికంగా ఉన్నారన్నారు. ప్రతిఒక్క కుటుంబతో, ప్రతి వ్యిక్తితో సత్సంబంధాలు ఏర్పడేలా, వారి సమస్యలు తెలుసుకునేలా వలంటీర్ల వ్యవస్థ సమర్థంగా పనిచేయాలని సూచించారు. ప్రతి కుటుంబానికి సరిపడా సురక్షిత తాగునీరు అందించాలన్నారు. నీటిని పొందే హక్కు అందరికీ ఉందని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి నీటి కుళాయిలు ఏర్పాటు చేయాలని, నీటి వృథాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈవిషయమై అధికారులను వివరణ కోరారు. వేసవిలో నీటి ఎద్దడి తలెత్తితే సరఫరా ఇబ్బంది అవుతందనే నీటి కనెక్షన్లు నూరుశాతం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. కుళాయి కనెక్షన్‌లు పెండింగ్‌లో లేవని వివరించారు. అందరికీ సురక్షిత తాగునీరు అందించటం మన బాధ్యత అని కేంద్ర ప్రతినిధులు సృష్టం చేశారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను నియంత్రించి ప్రజలు ఆరోగ్యవంతులుగా జీవించేలా చూడాలన్నారు. నీటి కాలుష్యంపై అవగాహన కల్పించాలని, జల సంరక్షణపై ప్రజలను చైతన్యపర్చాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ ఎస్‌ఈలు అల్లాభక్షు, అమరేశ్వర్, ఈఈ సాయినాథ్, ఎంపీడీవో కొడాలి అనూరాధ, ఈవోఆర్డీ దుర్గాప్రసాద్, ఏఈ సుబ్బారావు, ఈవో మైథిలి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.