విజయవాడ

టెన్త్ పరీక్షలకు సర్వ సన్నద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 25: జిల్లాలో మార్చి 23నుంచి ఏప్రిల్ 8వరకు పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంగళవారం పదో తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై విద్యా, పోలీస్, పోస్టల్, ఆర్టీసీ, విద్యుత్, వైద్య, తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,006 హైస్కూళ్లకు చెందిన 57,652 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారని, వారిలో 55,800 మంది రెగ్యులర్, 852 మంది ప్రైవేట్ విద్యార్థులు ఉన్నరన్నారు. ఇందుకు ఏర్పాటు చేసే 279 పరీక్ష కేంద్రాల్లో మంచినీరు, విద్యుత్, సిట్టింగ్, తదితర ఏర్పాట్లు విస్తృతంగా చేయాలన్నారు. పరీక్షల నిర్వహణకు 3,150 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని, రూట్ ఆఫీసర్లు 22 మంది, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు 14, చీఫ్ సూపరింటెండెంట్లు 279, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్స్ 279 మందిని నియమిస్తున్నట్లు తెలిపారు. 300 మందికన్నా ఎక్కువ విద్యార్థులు పరీక్షలు రాస్తున్న 12 కేంద్రాల్లో 12 మంది డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను నియమిస్తున్నామన్నారు. పరీక్షలు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షల సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. మార్చి 19, 20 తేదీల్లో మొదటి విడత, 25, 26 తేదీల్లో రెండో విడత వచ్చే పరీక్ష సామగ్రి తరలింపునకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షల సమయంలో 144 సెక్షన్ విధిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్సు, ఇంటర్నెట్ సెంటర్లను మూసివుంచాలన్నారు. పరీక్షలు రాసే విద్యార్థులకు అనువుగా బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణలో సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఇంతియాజ్ సూచించారు. సమావేశంలో డీఆర్వో ఏ ప్రసాద్, డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి, ఆర్‌ఐఓ పి రవికుమార్, డీఎంహెచ్‌ఓ టీఆర్‌ఎస్ మూర్తి, విద్యుత్, పోస్టల్, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.