విజయవాడ

దేశ వ్యాప్తంగా మరో మూడు వారాలు నిర్బంధ కర్ఫ్యూ విధించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 22: దేశానికి ముంచుకొస్తున్న పెను ఉపద్రవాన్ని ఏదోవిధంగా నివారించే విషయంలో ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చాలా సీరియస్‌గా స్పందించి శరవేగంతో అడుగులు వేస్తున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. కరోనా వైరస్ విషయమై తాను ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడుతో ఫోన్‌లో ఆదివారం ఉదయం మాట్లాడినట్లు చెప్పారు. ప్రపంచంలోని అతిపెద్ద దేశాలను చుట్టివచ్చిన తర్వాత కరోనా వైరస్ ఆఖరిగా మన దేశంలోకి ప్రవేశించిందన్నారు. చైనా ప్రభుత్వం తక్షణం స్పందించి త్వరగానే వైరస్‌ను ఆ దేశం నుంచి పారదోల గలిగిందన్నారు. ఇక ప్రధాని మోదీ పిలుపు మేర అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించిన తీరుతో రాష్ట్రంలో నేడు ఒక్కరోజు 14గంటల కర్ఫ్యూ విధించారని, అయినప్పటికీ కనీసం ఇలాంటి కర్ప్యూ దేశవ్యాప్తంగా కనీసం మూడువారాల పాటు కొనసాగినప్పుడే ఫలితాలు చేకూరతాయన్నారు. ఈలోపుగా సైనికులు, పోలీసులు, అధికార సిబ్బంది, సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు నిత్యావసర సరుకులను వారి ముంగిట చేర్చాల్సి ఉందన్నారు. ఇందుకోసం ప్రకృతి వైపరీత్య నిధిని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. అసలు ప్రతి వందేళ్లకోసారి ఫ్లూ, ప్లేగు, కలరా, మశూచి వంటి ఉపద్రవాలు వెంటాడుతునే ఉన్నాయని, అలాగే కరోనా వైరస్‌ని నివారణకు శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేస్తున్నారన్నారు. అయితే సరైన నివారణ మందు మార్కెట్‌లోకి రావడానికి కనీసం మరో వందరోజుల సమయం పడుతుందని డాక్టర్ శివాజీ వివరించారు.

దేశ ప్రజల ఆరోగ్యం కాంక్షిస్తూ
దుర్గగుడిలో ప్రత్యేక పూజలు

విజయవాడ, మార్చి 22: దేశ ప్రజల ఆరోగ్య సంక్షేమార్థం విజయవాడ శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎంవీ సురేష్‌బాబు పర్యవేక్షణలో ఆలయ స్థానచార్యులు విష్ణ్భుట్ల శివప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆలయ వైదిక కమిటీ సభ్యులు, ఆర్చక సిబ్బంది ఆదివారం సేవాష్టాక్షరీ మహామంత్ర హవనం, మహామృత్యుంజయ మంత్ర హవనం, శతలదుర్గా హోమం, పారాయణం, సూర్యనమస్కారాలు, చండీహవనం వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమాలు ఏప్రిల్ మూడో తేదీ వరకు జరగనున్నాయి.

దేశంలో ఏడాదికోసారైనా జనతా కర్ఫ్యూను అమలు చేయాలి
* సంఘసంస్కర్తల అభిలాష

విజయవాడ, మార్చి 22: ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో అత్యంత తక్కువ సమయంలోనే ఆదివారం దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విజయవంతం కావటం పట్ల కుల, మత, వర్గ రాజకీయాలకు అతీతంగా సర్వత్రా హర్షాతిరేకలు వ్యక్తమవుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని సంఘసంస్కర్తలు కొందరు ఈసందర్భంగా పలు సూచనలు చేశారు. నేటి జనతా కర్ఫ్యూ వల్ల దేశంలో ఒక్క రోడ్డు ప్రమాదం లేదు. కోట్లాది రూపాయల విలువైన ఇంధనం ఆదా అయింది. కాలుష్యం తగ్గింది. జీవహింస తగ్గింది. ప్రతిఒక్కరూ రోజంతా తమ కుటుంబంతో గడిపారు. ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత విశ్రాంతి లభించింది. అందరికీ శారీరక విరామం. ప్రధానంగా ప్రకృతి పట్ల ఎవరికి వారు తమ బాధ్యతను గుర్తుకు తెచ్చుకున్నారని వారు పేర్కొన్నారు. కనుక ప్రతి ఏడాది దేశ వ్యాపితంగా జనతా కర్ఫ్యూ పాటించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని వారు సూచించారు.