విజయవాడ

స్వచ్ఛందంగా ‘జనతా కర్ఫ్యూ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), మార్చి 22: కరోనా వైరస్ నియంత్రణకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూ నగరంలో విజయవంతమైంది. నగర వ్యాప్తంగా ప్రజలందరూ కర్ఫ్యూని పాటిస్తూ ఇంటికే పరిమితమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకూ నిర్విఘ్నంగా జరిగిన జనతా కర్ఫ్యూలో భాగంగా అన్ని దేవాలయాలు, మసీదులు, చర్చిలు మూతపడ్డాయి. తెల్లవారుఝామునే ఆదివారం ప్రార్థనలు ముగించుకున్న క్రైస్తవులు కరోనా నియంత్రణ కోసం మళ్లీ ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. 14 గంటల జనతా కర్ఫ్యూతో ఇంటికే పరిమితమైన ప్రజానీకం తమ కుటుంబ సభ్యులతో సంతోష, ఆనందాల మధ్య కాలక్షేపం చేశారు. సెల్‌ఫోన్, సోషల్ మీడియాతోపాటు టీవీ ప్రసారాలతోపాటు ఇంట్లో ఆడుకునే క్యారమ్ బోర్డు, చెస్ వంటి ఆటలతో పిల్లాపాపలతో పెద్దలు గడిపారు. ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో బస్టాండ్, రైల్వే స్టేషన్లలో కూడా ప్రయాణికులు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవడంతో ఆయా ప్రాంగణాలు వెల వెలబోయాయి. నగర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకులతోపాటు కాళేశ్వరరావు కూరగాయల మార్కెట్, రాజీవ్‌గాంధీ హోల్‌సేల్ మార్కెట్లు, వస్తల్రత, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, తదితర వ్యాపార సంస్థలు సైతం మూతపడ్డాయి. అత్యవసర సేవలైన మెడికల్ షాపులు, పాల దుకాణాలు మాత్రమే అక్కడక్కడా తెరచి ఉన్నాయి. నగర ప్రజలందరూ స్వచ్ఛందంగా కర్ఫ్యూకు మద్దతు తెలపడంతో తెల్లవారుఝాము నుంచే ప్రధాన రహదారులతోపాటు నగరంలోని పలు అంతర్గత రహదారులు జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపించాయి. అయితే పోలీసులు మున్సిపల్, శానిటరీ సిబ్బంది మాత్రం తమ విధుల్లో భాగంగా నగరంలో అన్ని ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ముఖ్యంగా మున్సిపల్ శానిటరీ సిబ్బంది జన సాంద్రత ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక శానిటేషన్ చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా బీసెంట్‌రోడ్డు తోపాటు నగర వ్యాప్తంగా ఉన్న పలు చేపల మార్కెట్, చికెన్, మటన్ మార్కెట్ ప్రాంతాల్లో కరోనా వైరస్ నిరోధక రసాయనాలను పిచికారీ చేశారు. వీటితోపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలతోపాటు ఆయా బ్లీచింగ్ చల్లారు.
రహదారులపై కనిపించని జన సంచారం
అనునిత్యం వందలాది వాహనాలు, వేలాది ప్రజల సంచారంతో కిటకిటలాడే నగర రహదారులన్నీ జనతా కర్ఫ్యూతో నిర్మాణుష్యంగా కనిపించాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ముందస్తుగా అధికారులు నగర ప్రజలకు అవగాహన, చైతన్యం పర్చిన నేపథ్యంలో కర్ఫ్యూ కు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నగర ప్రజలందరూ స్వచ్ఛందంగా ఆదివారం ఇంటికే పరిమితమయ్యారు. ఆదివారం ఇంటికి అవసరమైన నిత్యావసరాలు, కూరగాయలు, పాలు వంటకు అవసరమైన ఆహార పదార్థాలను నిల్వ చేసుకున్న నేపథ్యంలో ఆదివారం నగర రహదారులు జన సంచారం లేక వెల వెలబోయాయి. ముఖ్యంగా ఆదివారం అత్యంత రద్దీగా ఉండే చికెన్, మటన్ చేపలు మాంసం దుకాణాలు తెరచుకోలేదు. ఇక ప్రజారవాణా వ్యవస్థలో ముఖ్య భూమిక పోషించే ఆర్టీసీ సేవలు పూర్తిగా నిలచిపోవడంతో బస్సులన్నీ డిపోకే పరిమితమైనాయి. సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో నగర రహదారులపై అత్యధికంగా చక్కర్లు కొట్టే ఆటోలు కూడా ఎక్కడా కనిపించలేదు. ఆటో యూనియన్లు ఈ కర్ఫ్యూకు మద్దతు తెలపడంతో అవి కూడా ఇంటికే పరిమితమయ్యాయి.
చప్పట్లతో జనం అభినందనలు
కరోనా మహమ్మారి విజృంభించకుండా, అనుమానితులకు వైద్య సేవలందిస్తున్న వైద్య సిబ్బంది, శానిటరీ సిబ్బంది, పోలీసు సిబ్బంది, రెవెన్యూ, తదితర శాఖల అధికార యంత్రాంగానికి నగర ప్రజానీకం చప్పట్లతో ప్రత్యేకంగా అభినందించారు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూలో పాలుపంచుకున్న నగర ప్రజలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు తమ తమ ఇంటి వద్ద చప్పట్లు కొడుతూ కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ తోపాటు పలువురు ఉన్నతాధికారులు, పలువురు రాజకీయ నేతలు, స్వచ్చంధ సేవా సంస్థల ప్రతినిధులు తమ ఇంటి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి సంఘీభావం తెలిపారు.