విజయవాడ

పనుల్లేక అల్లాడుతున్న ప్రజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ), ఏప్రిల్ 13: సీఎం జగన్ ఇచ్చే మాస్కులు పేద ప్రజల ఆకలి తీర్చవని తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న తెలిపారు. మాస్కులతో పాటు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయం ప్రతీ ఒక్కరికీ వేయాలని సోమవారం ట్విట్టర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ట్యాగ్ చేస్తూ కామెంట్ చేశారు. మూడు మాస్కులతో పాటు ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం పంపితే ప్రజల ఆకలి తీరుతుందన్నారు. కరోనా దెబ్బకి పనులు లేక ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వారిని ఆదుకోవడానికి ఐదు వేల రూపాయలను వెంటనే ప్రతి ఒక్కరికీ విడుదల చేయాలన్నారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్న ఆయన తక్షణమే పంట నష్టం అంచానా వేసి పరిహారం చెల్లించాలన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు, మున్సిపాలిటీలకు ఇచ్చిన డబ్బుని ఫ్రీజ్ చేసి ఇతర అవసరాలకు వాడుకున్నారని తెలిపారు. ఆ సొమ్ము అవసరాలకు వాడుకున్నారని విమర్శించారు. ఆ సొమ్ము ఉంటే గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది అంటూ ట్వీట్ చేశారు.