విజయవాడ

జిఎస్‌టితో ఇ-కామ్ కంపెనీలకు ఎంతో ప్రయోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 13: జిఎస్‌టిలో ఇ-కామ్ లావాదేవీలకు స్పష్టమైన నిర్వచనం ఉంటుందని, ఈ కారణంగా జిఎస్‌టితో అటు ప్రభుత్వానికి, ఇటు కంపెనీలకు ప్రయోజనం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ కస్టమ్స్ కమిషనర్ షేక్ ఖాదర్ రెహమాన్ అన్నారు. మంగళవారం సాయంత్రం గ్రాండ్ మినర్వా హోటల్‌లో భారత పరిశ్రమల సమాఖ్య ఆధ్వర్యంలో జిఎస్‌టిపై జరిగిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. దీనికి విజయవాడ జోన్ చైర్మన్ జి.వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. కమిషనర్ రెహమాన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ జిఎస్‌టి అమలుతో పన్నుల వ్యవస్థ చక్కబడుతుందని, కేంద్రం, రాష్ట్రాల పన్నుల వసూళ్లు పెరుగుతాయని, కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో అనేక పరోక్ష పన్నులకు తెరదించవచ్చని, సమస్యలుండవని పేర్కొన్నారు. మన దేశం వర్థమాన ఆర్థిక వ్యవస్థలు, అధికాదాయ దేశాల్లో ఉన్నత స్థానానికి చేరుకుంటుందన్నారు. జిఎస్‌టి వల్ల కేంద్రం, రాష్ట్రాలకు పరస్పర ప్రయోజనకరంగా వుంటుందని, ఇది దేశ స్థూల ఆర్ధిక ఉత్పాదకత పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. ద్వంద పన్నుల విధానం తొలగిపోవడమే కాకుండా ఎగుమతి, దిగుమతి పన్నులు కూడా ఒకే పరిధిలోకి వస్తాయన్నారు.
బిడిఓ ఇండియా ఎల్‌ఎల్‌పి పార్టనర్ నవీన్‌రాజ్ పురోహిత్ మాట్లాడుతూ జిఎస్‌టి అమలుతో పలు కంపెనీలకు పన్నులు, లాజిస్టిక్స్ తదితర అంశాలపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సిఐఐ విజయవాడ జోన్ చైర్మన్ జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో పరిశ్రమల రంగం వేగంగా వృద్ధి చెందినా పలు సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. పలు అంశాలపై సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. సిఐఐ కన్వీనర్ పి.రవికిరణ్ మాట్లాడుతూ ఏకీకృత పన్ను నిర్మాణ విధానం లేకపోడంతో డబుల్ టాక్సేషన్ లాంటి సమస్యలు, దేశవ్యాప్తంగా వస్తు రవాణాకి అడ్డంకులు, తదితర సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అనంతరం కస్టమ్స్ కమిషనర్ రెహమాన్‌ను నిర్వాహకులు దుశ్శాలువ, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో సిఐఐ ప్రతినిధి చంద్రన్, కస్టమ్స్ సూపరింటెండెంట్ గుమ్మడి సీతారామయ్య చౌదరి, పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.