విజయవాడ

పాలకుల్లో విభేదాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), సెప్టెంబర్ 25: విజయవాడ నగర పాలక సంస్థలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిందన్న సంతోషం కన్నా విచారమే ఎక్కువగా కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రతి 3నెలలకు జరిగే కౌన్సిల్ సమావేశాలు మొదటి నుంచి ఈనెల 23న జరిగిన కౌన్సిల్ వరకూ తీరును పరిశీలిస్తే ఒక పక్క పాలకుల్లో విభేదాలు కార్పొరేటర్లలో తీవ్ర అసంతృప్తి పెచ్చురిల్లుతున్నాయన్న విషయం మొన్న జరిగిన కౌన్సిల్ తీరే సాక్షిగా నిలుస్తుంది. చెప్పుకోవడానికి అత్యధిక మెజార్టీతో విఎంసి పాలనను కైవశం చేసుకొన్నామని సంతోష పడ్డ టిడిపి పార్టీ పెద్దలు కూడా విఎంసి టిడిపి పాలనలో చోటుచేసుకొంటున్న వివిధ ఉందంతాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారంటే నగర పాలనలో టిడిపి తీరు చెప్పకనే చెప్పవచ్చు. తొలిగా జరిగిన కౌన్సిల్ తీర్మానాలలో వివాదం రేపిన దర్గా భూములు, ఆ తరువాత కనకదుర్గా లేవుట్ అప్రూవల్ వ్యవహారంతోపాటు ఇటీవల కొద్ది రోజులుగా నగర రాజకీయాలను తీవ్ర ప్రభావం చూపుతున్న కృష్ణా పుష్కర టెండర్ ప్రక్రియలో మేయర్ కోనేరు శ్రీ్ధర్‌పై వెల్లువెత్తిన ఆరోపణలు, విపక్షాలు చేసిన ఫిర్యాదులు ఇలా చెప్పుకొంటూ పొతే వివిధ తీర్మాన అంశాలపై వచ్చిన ఆరోపణలు రాష్ట్రంలోని ఏ కార్పొరేషన్‌ల లోనూ రాలేదనే చెప్పవచ్చు. ఇవన్నీ ఒక ఎతైతే శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్, ఉప మేయర్ గోగుల రమణారావుల మధ్య చోటుచేసుకొన్న అభిప్రాయ విభేదాలు, వాగ్వాదాలు, స్వపక్ష కార్పొరేటర్లలోనే విస్మయం కలిగించగా ఈ ఘటనపై విపక్ష కార్పొరేటర్లు ముక్కున వేలేసుకొన్నారు. కౌన్సిల్‌లో ప్రవేశపెడుతున్న తీర్మాన అంశాల వెనుక ఇంతటి రాజకీయాలు నెలకొంటాయన్న విధంగా మేయర్, ఉప మేయర్లు వ్యవహరంపై పెదవి విరుస్తున్నారు. మెజార్టీ ఉందికదాని ప్రతిపక్షాలతో పనిలేకుండా తీర్మానిస్తున్న వివిధ అంశాలలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారన్న ప్రతిపక్ష పార్టీల ఆరోపణలకు నిజరూపం దాల్చుతోంది. అలాగే సింగ్‌నగర్‌లో ఎన్‌టిఆర్ విగ్రహ ఏర్పాటుకు చూపిన ఉత్సాహం సర్కిల్ వన్ పరిధి ప్రాంతంలో ఎక్కడైనా ఒకచోట శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న కార్పొరేటర్ అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పుననుసరించి అనుమతించకపోవడంపై వివిధ విమర్శలు వెల్లువెత్తిన వైనం గమనార్హం. తీర్మానాల్లో ఎవరికి ఎంతటి ప్రయోజనాలున్నాయన్న విషయం పక్కన పెడితే మేయర్ కోనేరు శ్రీ్ధర్ పై వచ్చిన ఆరోపణలను తొలుత స్వపక్ష కార్పొరేటర్లే బహిర్గతం చేసిన వైనం గమనార్హం. ఇందుకు కనకదుర్గ లే అవుట్ అప్రూవల్‌లో చోటుచేసుకొన్న ఘటనలే నిదర్శనం. కౌన్సిల్ టిడిపి రాజకీయాలను మరింతగా వేడెక్కించిన ఈ ఉదంతం చివరికి మేయర్ శ్రీ్ధర్‌ను గుండె సంబంధిత అనారోగ్యానికి గురిచేసిందంటే ఆ విషయంలో దాగిన నిజా నిజాలను ఇట్టే కనిపెట్టవచ్చు. కాగా మేయర్, ఉప మేయర్ వివాదంలో కూడా ఇలాంటి ప్రాముఖ్యమైన అంశం ఉంది కాబట్టే సుమారు గంటన్నరకు పైగా వాదోప వాదనల్లో చివరికి మేయర్ తన పంతం నెగ్గించుకోగా ఉప మేయర్ తన నిరసన తెలుపుతూ ఏకంగా కౌన్సిల్ తదుపరి సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయిన తీరు ఇప్పుడు మరో వివాదానికి కారణమై నగర టిడిపి రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ప్రస్తుతం టిడిపి పెద్దలకు హాట్ టాపిక్‌గా మారింది. అయితే కొంతకాలంగా నగర పాలనలో రొటేషన్ పద్ధతిని అమలులోకి తీసుకువచ్చి అందరికీ సమన్యాయం చేయాలంటున్న కార్పొరేటర్ తమ్ముళ్లు, నగర పార్టీ నేతలు చాపకింద నీరులా తమ యత్నాలకు పదును పెడుతున్నారు. కనకదుర్గ లే అవుట్ విషయంలో కలుగజేసుకొన్న పార్టీ పెద్దలు ఇప్పుడు మేయర్, ఉప మేయర్ విషయంలో నెలకొన్న వివాదాన్ని ఏవిధంగా పరిష్కరిస్తారన్న వైఖరిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.