విజయవాడ

పదవులపై తొలగిన ప్రతిష్ఠంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, సెప్టెంబర్ 29: శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి సుమారు ఎనిమిదేళ్ల తర్వాత ట్రస్ట్‌బోర్డును ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనియమాకపు ఉత్తర్వుల్లో ట్రస్ట్‌బోర్డు కమిటీ చైర్మన్‌గా గద్దె రామోహనరావు వర్గానికి చెందిన యలమంచిలి గౌరంగబాబు నియమితులయ్యారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖకి బిజెపికి చెందిన పి మాణిక్యాలరావు మంత్రిగా ఉండటంతో తొలి నుండి బిజెపికి చెందిన నేతలకు దుర్గగుడి ట్రస్ట్ బోర్డు కమిటీ చైర్మన్ పదవి లభిస్తోందని ఈపార్టీనేతలు గంపెడు ఆశలతో ఉన్నారు. అక్టోబర్ 1నుండి అమ్మవారి దసరా మహోత్సవాలు ప్రారంభం కానున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారికే దుర్గగుడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవితోపాటు నగర పరిధిలోని 3 నియోజకవర్గాలతోపాటు, పెనమలూరు నియోజకవర్గానికి సైతం సముచిత స్థానం కేటాయించారు. ఇప్పటికే నగరంలోని మూడు నియోజకవర్గాలతోపాటు పెనమలూరులో కూడా అధికార పార్టీకి చెందిన శాసన సభ్యులు ఉండటంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వీలుగా ట్రస్ట్‌బోర్డుల పదవులను కేటాయించారు. ఇటీవల కాంగ్రెస్‌పార్టీ నుండి దేశం గూటికి చేరిన మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) వర్గానికి దుర్గగుడి ట్రస్ట్ బోర్డులో మెండి చెయ్యి ఎదురైంది. పశ్చిమ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన పరాజయం పొందిన వెలంపల్లి శ్రీనివాస్‌కు వర్గానికీ ఈవిషయంలో చుక్కెదురైంది. నరసాపురం పార్లమెంట్ సభ్యుడు, ఆంధ్ర క్రికెట్ సంఘ కార్యదర్శి గోగరాజు గంగరాజుకు అత్యంత సన్నిహితుడైన గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పెంచలయ్యకు చివరకు దుర్గగుడి ధర్మకర్త పదవి మాత్రమే లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నామినేటెడ్ ట్రస్ట్ బోర్డును పరిశీలిస్తే పూర్తిస్థాయిలో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారికే ట్రస్ట్ బోర్డులో స్థానం లభించింది. ధర్మకర్తలుగా వెలగపూడి శంకరబాబు, బడేటి ధర్మారావు, కోడేల సూర్యలతాకుమారి, ఇ సాంబశివరావు, పామర్తి విజయశేఖర్, డిఆర్‌యస్‌యస్‌వి ప్రసాద్, డి రాంబాబు, జి పద్మాశేఖర్, విశ్వనాథపల్లి పాప, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బి పూర్ణ మల్లి రామ్ ప్రసాద్, గుంటూరు జిల్లాకు చెందిన ఐ పెంచలయ్య, ఖమ్మం జిల్లాకు చెందిన డాక్టర్ వాసిరెడ్డి రామనాథమ్, నల్గొండ జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రాజా, ఈట్రస్ట్‌బోర్డులో సభ్యులు ఉన్నారు. చైర్మన్‌తో కలిసి మొత్తం 14మంది సభ్యులుగా దుర్గగుడి ట్రస్ట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ట్రస్ట్ చైర్మన్, సభ్యులకు దుర్గగుడి అధికారులు సమాచారం పంపి వారిని ఆహ్వానించాల్సి ఉంది. అక్టోబర్ 1నుండి దసరామహోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు చైర్మన్, సభ్యులను దుర్గగుడి ఇవో సమన్వయం చేసుకొని ఈమహోత్సవాలను విజయవంతంగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.