విజయవాడ

విదేశాల్లో చదివే విద్యార్థులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంజిసర్కిల్, అక్టోబర్ 17: విదేశాల్లో చదువుకునే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఒక వరం వంటిదని రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ మంత్రి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. ఆయన సోమవారం నగరంలోని హోటల్ మురళీ ఫార్చూన్‌లో ఈ పథకం ద్వారా విదేశాలకు వెళ్తున్న 21 మంది ఎస్సీ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు విదేశీ విద్యకు చేయూతను అందించి వారిని ఆర్థికంగా, సామాజికంగా ఎదిగేందుకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తున్నట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థులందరినీ ఈ పథకం ద్వారా ఎంపిక చేసి వారికి సహాయం అందించి వారిని విదేశాలకు పంపుతామన్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా పది లక్షల రూపాయలను అందిస్తున్నామన్నారు. అయితే విద్యార్థుల నుండి వచ్చిన అభ్యర్థనలను పరిశీలించిన మీదట, 20 లక్షల వరకు సహాయం పెంచటానికి నోడల్ ఏజెన్సీ అనుమతి కూడా లభించిందన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు వెళ్లే 21 మంది విద్యార్థుల బ్యాచ్‌కు లబ్ధిచేకూరే విధంగా సిఎం దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ పథకం ద్వారా 11 దేశాలకు విదేశాల్లో పీజీ, డిప్లొమా చేయటానికి విద్యార్థులను పంపిస్తున్నట్లు చెప్పారు. లక్షలు ఖర్చు చేసి విదేశాల్లో చదివే స్తోమత లేని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు ఇదో మంచి అవకాశమన్నారు. ఇప్పటి వరకు 190 మంది విద్యార్థులను వివిధ దేశాలకు విదేశీ విద్య కోసం ఈ పథకం ద్వారా పంపించినట్లు ఆయన చెప్పారు. వీరికి ఐదు లక్షల రూపాయలను ఎస్సీ కార్పొరేషన్ జాతీయ బ్యాంకులకు హామీ ఇవ్వడం ద్వారా వీరికి రుణం కింద అందిస్తున్నట్లు తెలిపారు. మొదటిలో కేవలం ఐదు దేశాలకు మత్రమే విద్యార్థులను పంపించే వారని, కాని ఇప్పుడు 15 దేశాలకు విద్యార్థులను ఈ పథకం ద్వారా పంపిస్తున్నట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా విదేశాలకు వెళ్లాలంటే టోఫెల్, జీఆర్‌ఈ, జీమ్యాట్, ఐఈయల్‌టీయస్‌లో రాణించేందుకు కావలసిన శిక్షణను ప్రభుత్వ ఖర్చులతో ఆరు శిక్షణా కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ పథకం ద్వారా ప్రోత్సహం ఇవ్వడంతో విదేశాలకు వెళ్లే ఎస్సీల సంఖ్యా ఏటా పెరుగుతుందన్నారు. ప్రస్తుతం అంతా గ్లోబల్ ఎకానమీ విలేజ్ అవుతున్న సమయంలో తప్పనిసరిగా విదేశాల్లో చదువుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఈ పథకం విజయవంతం కావడంతో కాపు కార్పొరేషన్, బిసి కార్పొరేషన్‌లు కూడా విదేశాలకు ఆయా కులాల నుండి విదేశాలకు విద్యార్థులు చదువుకోవడానికి పంపిస్తున్నట్లు గుర్తు చేశారు. అనంతరం ఆయన విదేశాల్లో చదువుకునేందుకు వెళ్తున్న విద్యార్థులకు అర్హత పత్రాలను పంపిణీ చేశారు.