విజయవాడ

మార్కెట్ కమిటీలు ఇక వ్యాపార కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 4: స్థానిక కలెక్టర్ చాంబర్‌లో శుక్రవారం మార్కెటింగ్, వ్యవసాయ, ‘ఇ-నామ్’ సాంకేతిక సంస్థ ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ మార్కెట్ కమిటీల ద్వారా జరిగే ప్రతిఒక్క లావాదేవీని ఇ-మండి విధానంలో నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి మార్కెట్ కమిటీని ధాన్యం సేకరణ కేంద్రంగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. రైతులకు లాభదాయకమైన విధానాలలో మార్కెట్ కమిటీలు బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రతి మార్కెట్ కమిటీ, ఎఎంసిల పరిధిలో రైతులు పండించే పంటల కొనుగోళ్ల లావాదేవీలు నిర్వహించేలా వాటిని అభివృద్ధి చేయాలన్నారు. వ్యాపార కేంద్రాలుగా మార్కెట్ కమిటీలు రూపుదిద్దాలని కలెక్టర్ అన్నారు. ఉదాహరణకు నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాలలో మిర్చి పంట సాగు చేస్తున్నారని, అయితే ఆ రైతు గుంటూరులో అమ్మకాలను చేపడుతున్నారని అన్నారు. ఆయా ప్రాంతాలలోని రైతులకు లాభసాటిగా నిలిచే విధానంలో మార్కెటింగ్ శాఖ, ఇతర జిల్లాల్లోని ప్రధాన ఎఎంసిలో అమలవుతున్న ధరలకు అనుగుణగా ఈ ప్రాంతంలో సాగుచేసే రైతులకు ఆ ధర లభించేలాగా అధికారులు చొరవ చూపాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు ఎఎంసిల పరిధిలో పండించే పంటల సాగు, దిగుబడి వివరాలు సమన్వయం చేసి వారికి సమీపంలోని మార్కెట్ యార్డులో లావాదేవిలు నిర్వహించేలా చూడాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. మధ్యవర్తుల ద్వారా జరిగే కొనుగోళ్లు వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం ద్వారా వారికి సరైన ధరను అందించగలుగుతామన్నారు.
ఇతర మార్కెట్లలో ఆయా పంటలకు, ఉత్పత్తులకు జరిగే లావాదేవిల వివరాలను ఇతర ప్రాంతాలలోని ఆ పంటలకు లభించే మద్దతు ధరను ప్రతి మార్కెట్‌యార్డ్ పరిధిలోను ప్రదర్శింపజేయాలని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఎఎంసిల పరిధిలో మరిన్ని పంటల ఉత్పత్తులను కొనుగోలు చేసేలాగా వాటి పరిధిలో ఎఎంసి చైర్మన్, కమిటీ సభ్యులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. అనంతరం ఎఎంసి చైర్మన్‌ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులు పండించే పంటల కొనుగోలు కోసం ఇ-నామ్ సాంకేతిక పరిజ్ఞానంపై పూర్తిస్థాయిలో సమీక్షించి కొన్ని ప్రతిపాదనలను చేశారు. జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీలలో ఈ విధానాన్ని అమలు చేయడానికి రానున్న 15 రోజుల్లో పూర్తిస్థాయి కార్యాచరణ నివేదికలతో హాజరుకావాలని జెసి పేర్కొన్నారు. మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో మార్కెటింగ్ శాఖ వసూలు చేసే సెస్‌ను ఇ-మండి వైబ్‌సెట్‌లో ప్రతిబింబించాలని అన్నారు. ఈ సమావేశంలో మార్కెటింగ్ శాఖ జెడి సి రామాంజనేయులు, వ్యవసాయశాఖ జెడి యు నరింహారావు, ఎఎంసి సెక్రటరీ గోపాలకృష్ణ, డిడివో శ్యామ్‌సుందర్, ఇ-నామ్ కంపెనీ ప్రతినిధి ఎ.చంద్రశేఖర్, సీనియర్ మార్కెటింగ్ అసిస్టెంట్ బి.రాజాబాబు, ఎడి జె.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.