కృష్ణ

ఐటి రంగంలో అభివృద్ధి దిశగా అడుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: ఆంధ్రప్రదేశ్ తొలి పరిపాలనా రాజధాని విజయవాడను సరికొత్త కంపెనీలు పలకరిస్తున్నాయి. నగరంలో పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డులో ఏర్పాటైన ఎక్సాన్ మిషన్ లన్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం ప్రారంభించారు. అనేక స్ట్ఫావేర్ సొల్యూషన్స్ కోసం ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తోంది. ఈ-గవర్నెన్స్, రిటైల్, హెల్త్‌కేర్‌లకు సంబంధించి ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. ఎపిఐఎంఎస్ సంస్థ సిఎండి యార్లగడ్డ రత్నకుమార్ ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయటానికి విశేష కృషి అందించారు. కంపెనీ సీఈవో ఉదయ్‌చంద్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు చేసే విధంగా తమ సంస్థ సేవలు అందించనుందని వివరించారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఐటిలో అంధ్రప్రదేశ్ ఐటిలో అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. దీనికి కృషి చేస్తున్న ఎపిఐఎంఎస్ వంటి సంస్థలు ముందుకు రావటం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ తదితరులు పాల్గొన్నారు.