విజయవాడ

రెండు రోజుల్లోగా పెన్షన్ల చెల్లింపు జరిగి తీరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 13: అన్ని పెన్షన్లను చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పెన్షన్లు అందటం లేదన్న ఫిర్యాదులు తనకు విన్పించకూడదని అన్నారు. ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బ్యాంకులకు రిజర్వ్ బ్యాంకు రూ.1448.40 కోట్లు పంపించిందని ముఖ్యమంత్రి తెలిపారు. వీటిలో ఇందులో 1,220 కోట్లు 2వేల రూపాయల నోట్లని, 55 కోట్లు రూ.500 రూపాయల నోట్లని తెలిపారు. మిగతా కరెన్సీ అంతా రూ.100, రూ.50, రూ.20, రూ.10 కరెన్సీ అని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో నగదు చెల్లింపులు, నగదు రహిత లావాదేవీలపై బ్యాంకింగ్ రంగ ప్రతినిధులతో మంగళవారం రాత్రి అమరావతి సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజలు ఎలా కష్టాలు పడుతున్నారో బ్యాంకు ఉన్నతాధికారులు తెలుసుకోవాలని కోరారు. నగదు రహిత లావాదేవీలకు సహకరించాలన్నారు. ప్రజలు ఎలా కష్టపడుతున్నారో తెలుసుకుని బ్యాంకు అధికారులు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. నెల రోజులు దాటింది. రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఉర్జిత్‌పటేల్‌తో ఫోనులో సంభాషిస్తూ ప్రజల్లో సహనం నశించే పరిస్థితికి తీసుకురావద్దని, నగదు పంపిణీ చక్కబరచాలని కోరారన్నారు. అవసరమైతే ఈ-పోస్ లాంటి యంత్రాల కోసం ప్రభుత్వం 30 నుంచి 40 కోట్లు వెచ్చించటానికి సిద్ధంగా వుందని, ఎం-పోస్, ఈ-పోస్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా నగదు రహిత లావాదేవీలు పెరిగే విధంగా చూడాలన్నారు. నేను ఆర్ధికరంగ నిపుణుడిని కాను, కానీ సామాన్య ప్రజల కష్టాలను అధ్యయనం చేసి, అర్ధం చేసుకుని రోజూ పరిస్థితిని సమీక్షిస్తూ కష్టాలు తీరే మార్గాన్ని అనే్వషిస్తున్నానని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పటికే చౌకధరల దుకాణాల్లో రూపే, ఈ-పోస్ యంత్రాల ద్వారా నగదు రహిత విక్రయాలు జరుగుతున్న అంశాన్ని గుర్తుచేస్తూ ఎన్ని స్వైపింగ్ మిషన్లయినా సమకూర్చవచ్చు, పరిస్థితి చక్కదిద్దండి అని ఆయన అధికారులను కోరారు. ప్రస్తుతం నగదు రహిత లావాదేవీలు 6.1 శాతం వున్నాయని, ప్రతిచోటా నగదు రహిత లావాదేవీలు 35 శాతం అయినా జరగాలని అన్నారు. మొబైల్ లావాదేవీల ద్వారా 10 శాతం, డెబిట్ కార్డుల ద్వారా 15 శాతానికి పెంచాలన్నారు. బయో మెట్రిక్ మిషన్లు 1000 అందుబాటులో వున్నాయని తెలిపారు. బ్యాంకులు ఖాతాదార్లకు ఇస్తున్న నగదు పరిమితిని క్రమంగా పెంచాలని, ఇంకా వారి సహనాన్ని పరీక్షించవద్దని ముఖ్యమంత్రి బ్యాంకు అధికారులను కోరారు. సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, సిఎంఓ అదనపు కార్యదర్శి ప్రద్యుమ్న, ఉన్నతాధికారులు రాజశేఖర్, విజయానంద్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాలకతీతంగా 23న ‘చలో వెలగపూడి’
* ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి
విజయవాడ (కార్పొరేషన్), డిసెంబర్ 13: పాత నోట్లు రద్దు చేసి 36రోజులు గడుస్తున్నా తగు పరిష్కార మార్గం చూపని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై అన్ని వర్గాల ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పక్షాన నిలిచి వారి తరఫున ఉద్యమించేందుకు రాజకీయాలకు అతీతంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయమ మాట్లాడుతూ అనాలోచితంగా చేసిన పాత నోట్ల రద్దు వెనుక పెద్ద కుట్రే ఉందని ఆరోపించారు. ప్రజలను బిక్షగాళ్లను చేసి వీధుల పాల్జేసిన ప్రభుత్వ తీరుకు నిరసనగా టిడిపి, బిజెపి మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈనెల 23న చలో వెగలపూడి కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. 36రోజులుగా 36 రకాలుగా ఎదుర్కొంటున్న అన్ని వర్గాల ప్రజలు ప్రజారాజధానిగా చెప్పుకొంటున్న వెలగపూడికి తరలివచ్చి పాలకులను ప్రశ్నించనున్నారని తెలిపారు. ఇందుకు ప్రభుత్వ అనుమతికోసం చట్టపరంగా చేయాల్సిన దరఖాస్తు చేస్తున్నామని, చలో వెలగపూడికి అనుమతించి పాలకులు తమ నైతికతను చాటుకోవాలన్నారు. నల్లకుబేరులను పట్టుకోవడంలో విఫలమైన పాలకులు ప్రజానీకాన్ని బిక్షగాళ్లను చేసి రోడ్డున పడేశారని ఎద్దేవా చేసారు. 2వేల నోటు కోసం గంటల కొద్దీ ఎంటిఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగాడుతున్నా దక్కుతుందో లేదో తెలియదు కానీ నల్ల కుబేరులు మాత్రం బ్యాంకులు, ఎంటిఎంల చుట్టూ తిరగకుండానే తమ నల్లధన పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేసుకొన్నారన్నడానికి ఇటీవల పట్టుబడ్డ నోట్ల కట్లే నిదర్శనమన్నారు. తాను రాసిన లేఖ వల్లే పాత నోట్ల రద్దయినాయని ప్రకటించుకొన్న సిఎం చంద్రబాబు ప్రస్తుతం ప్రజలు పడుతున్న అవస్థలపై కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదన్నారు. నోట్ల రద్దు వ్యవహారంలో టిడిపి-బిజెపి పాలకులు కుమ్మక్కై స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పార్లమెంటు మెట్లను ముద్దాడితే గౌరవం రాదని, ఆయా సాంప్రదాయాలను పాటించి ప్రధాన మంత్రి ఉభయ చట్ట సభల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తాము సేకరించిన ప్రజా ఇబ్బందులన్నింటినీ ఉభయ సభల కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్లతోపాటు రాహుల్ గాంధీకి కూడా నివేదించడం జరిగిందని, ఈనెల 15న పార్లమెంటు సభలు ముగిసే లోపు దీనిపై వారు చర్చకు తీసుకువచ్చిన నేపథ్యంలో ప్రధాని సరైన సమాధానం చెప్పకపోతే 23న జరిగే చలో వెలగపూడిలో జరిగే ప్రజా ఉద్యమంలో ప్రజా సత్తా చూపిస్తామన్నారు. ఈ సమావేశంలో సిటీ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మల్లాది విష్ణు, ఎపిసిసి ఉపాధ్యక్షుడు మట్టా జోబ్ రత్నకుమార్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు టిజెఆర్ సుధాకర్‌బాబు, సొంగ శాంతిభూషణం, జంగాగౌతం, ఎన్ రాజా, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, తదితరులు పాల్గొన్నారు.