విజయవాడ

కోనుగోలుదారుల విశ్వసనీయత పొందండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 6: కొనుగోలుదారుల విశ్వసనీయత పొందినప్పుడే ప్రాపర్టీ షోలకు ఆదరణ, విశ్వసనీయత పెరుగుతుందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. స్థానిక ఎ కనె్వన్షన్ హాలులో ఏర్పాటు చేసిన క్రెడాయ్ నాల్గవ ప్రాపర్టీ షోను శుక్రవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ ఈ ప్రాపర్టీ షోకి ముఖ్యమంత్రి చంద్రబాబుచే ప్రారంభించాల్సి ఉందని కాని జన్మభూమి కార్యక్రమాలలో పాల్గొనాల్సి ఉండటంతో పాటు, విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వుండటంతో రాలేకపోయారని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణాన్ని ప్రపంచస్థాయి నగరంగా రూపుదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయా నిర్మాణాల్లో నూతన సాంకేతిక విధానాలతో పాటు అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన డిజైన్స్‌తో నిర్మాణాలు చేపట్టటానికి కృషి చేస్తున్నామన్నారు. దేశంలో 29 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఇసుకను ఉచితంగా ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ మాత్రమే అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. గతంలో ఒక్కో లారీని 20 వేల నుంచి 60 వేల వరకు ఖర్చు పెట్టి ఇసుక కొనుగోలు చేసేవారని తెలిపారు. బిల్డర్లు ప్రభుత్వం కల్పిస్తున్న ఇలాంటి రాయితీలను ఉపయోగించుకుని ఇళ్ల కొనుగోలు రేటును అందుబాటులోకి తీసుకురావాలని అప్పుడే సామాన్యుడికి కూడా ధరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
దేశంలో క్రెడాయి సంస్థకు 11,500, రాష్ట్రంలో 1100 మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. నోట్ల రద్దు అనంతరం రాష్ట్రంలో భూముల ధరలతో పాటు కట్టడాల నిర్మాణాలు కూడా ప్రజలకు అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఈ సంస్థలపై ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆ విధమైన చర్యలు చేపడితే ఇంకా ప్రోత్సహిస్తారని చెప్పారు. ముఖ్యమంత్రిని నమ్మి రైతులు రాజధానికి 34 వేల ఎకరాలు ఇచ్చారని, 9 నెలల్లోనే అన్ని హంగులతో సెక్రటేరియట్ నిర్మాణం చేపట్టారని, త్వరలోనే అసెంబ్లీ భవనం పూర్తయి, బడ్జెట్ సమావేశాలు ఇక్కడే జరుగుతాయని చెప్పారు. రాష్ట్రంలో అవలంబిస్తున్న కొత్త సాంకేతిక విధానాల అమలు వల్ల హర్యానా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఎంవోయు కుదుర్చుకుందన్నారు. సిస్కో టెక్నాలజీని ఉపయోగించి ఇరిగేషన్ ఆఫీసును తక్కువ ఖర్చుతో నిర్మించగలిగామని చెప్పారు.
బిసి సంక్షేమ, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఇళ్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ప్రాపర్టీ షో ద్వారా ఒక అవగాహన ఏర్పడుతుందన్నారు. ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి అసంఘటిత కార్మికులకు చంద్రన్న బీమా ప్రవేశపెట్టారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ కమిటీ ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ, నోట్ల రద్దు తదనంతరం పెట్టే బడ్జెట్‌లో రియల్ రంగానికి ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తుందని చెప్పారు. మచిలీపట్నం ఎంపి కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, నోట్ల రద్దు అనంతరం రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ, క్రెడాయ్ లాంటి సంస్థలు అమరావతి రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావడం సంతోషమని తెలిపారు. క్రెడాయ్ ప్రతినిధి శివారెడ్డి, శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.