విజయవాడ

ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదురహిత చెల్లింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గురువారం ఉదయం నిర్వహించిన జాతీయ సదస్సులో కృష్ణాజిల్లాలో అమలు జరుగుతున్న ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు రహిత చెల్లింపుల అమలుపై జిల్లా కలెక్టర్ బాబు.ఎ వివరించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ జాతీయ సదస్సులో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానంపై జిల్లా కలెక్టర్ బాబు.ఎ ప్రసంగించారు. ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు రహిత చెల్లింపులు, సంస్కరణలపై జిల్లాలో అమలు జరుగుతున్న ఆధార్ అనేబుల్డ్ పిడిఎస్ (ఎఇపిడిఎస్) విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. రేషన్ కార్డుల వివరాలను డిజిటలైజేషన్ చేయడం ప్రతి లబ్దిదారునికి బ్యాంకు ఖాతా, ఆధార్‌తో రేషన్ కార్డు అనుసంధానం, సప్లై చైన్ ఆటోమిషన్ వంటి వివిధ విధానాల ద్వారా జిల్లాలో బ్యాంకర్లు, పౌర సరఫరాలశాఖ, చౌక ధరల దుకాణాల డీలర్లు, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్‌ఐసి), నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ), యుఐడిఎఐ వంటి సంస్థల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రజాపంపిణీ వ్యవస్థలో మార్చి, 2017 నాటికి నగదు రహిత లావాదేవీలు పూర్తిస్థాయిలో నిర్వహించాలని సూచించిందన్నారు.
ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడంలో జాతీయస్థాయిలోనే కృష్ణాజిల్లా మొదటిస్థానంలో నిలిచిందని, జిల్లాలో 2166 చౌక ధరల దుకాణాల్లో ఆధార్ ఆధారిత చెల్లింపులు 2016 మే నాటికే పూర్తిస్థాయిలో నిత్యావసర వస్తువులు లబ్దిదారులకు అందించామని వివరించారు. జనవరి 2017 మాసంలో 70 శాతం మంది అంటే 11.8 లక్షల రేషన్ కార్డు లబ్దిదారులు ఈ విధానం ద్వారా నిత్యావసర వస్తువులు తీసుకున్నారని సదస్సులో కలెక్టర్ బాబు.ఎ వివరించారు.
ప్రజాపంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించిన వారిలో 894 మంది లబ్దిదారులకు జాతీయస్థాయిలో గ్రహక్ యోజనా లక్కీ డ్రాలో కృష్ణాజిల్లాకు చెందినవారు వున్నారన్నారు. అందులో విజయవాడ నగరానికి చెందిన బొద్దాని రమణమ్మ ఈనెల 6వ తేదీన రూ.64.75 నగదు రహిత చెల్లింపులు చేసి లక్కీడ్రాలో లక్ష రూపాయలు బహుమతిగా గెలుచుకున్నారని కలెక్టర్ సదస్సులో వివరించారు. అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత పౌర సరఫరాల శాఖ మంత్రి, కార్యదర్శులు ఈ సదస్సుకు హాజరయ్యారు.