విజయవాడ

జైళ్లను ఆధునీకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఫిబ్రవరి 13: రాష్ట్రంలోని జైళ్ళను ఆధుకీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. జైళ్ళలో సంస్కరణలను అమలు చేయడం ద్వారా ఆధునిక కారాగారాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విజయవాడలో రాష్ట్ర జైళ్ళ శాఖ ప్రధాన కార్యాలయాన్ని (జైళ్ళ డిజి ఆఫీసు) హోం మంత్రి సోమవారం ప్రారంభించారు. జైళ్ళశాఖ ప్రధాన కార్యాలయం హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించారు. ఇక నుంచి అధికారిక కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచి కొనసాగనున్నాయి. అదేవిధంగా ఆధునీకరించిన విజయవాడలోని జిల్లా జైలును కూడా మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ నడిబొడున్న ఉన్న జైళ్ళను శివారు ప్రాంతాలకు తరలించి అన్ని సౌకర్యాలతో జైళ్ళను నిర్మించే యోచన ఉందన్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గించి శాంతి భద్రతలను కాపాడలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. శిక్షానంతరం విడుదలైన ఖైదీలు సమాజంలో గౌరవంగా జీవించాలన్నారు. విచారణ సమయంలో జైళ్లలో ఉన్న నిందితులు, శిక్ష పడ్డ ఖైదీలు అనారోగ్యంతో ఏటా 50మంది మృత్యువాత పడుతున్నారని చెప్పారు. వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఐదు కోట్లతో రాజమండ్రిలో ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు. ఆధునీకరించిన విజయవాడ జైలుతోపాటు రాష్ట్రంలోని అన్ని జైళ్ళల్లో వౌలిక సదుపాయాలు మెరుగు పరుస్తున్నట్లు చెప్పారు. నాలుగు కేంద్ర కారాగారాలు, ఒక ఓపెన్ జైలు, 80 సబ్ జైళ్ళు ఉన్నాయని వాటిలో సబ్ జైళ్ళను మూసేసి డివిజన్ స్థాయిలో కొత్తవి నిర్మించేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. శిక్ష అనుభవిస్తున్న వారి కుటుంబాలకు చేదోడుగా ఉండేలా వారికి పని కల్పించి వృత్తి శిక్షణ ఇస్తున్నామని, వారు తయారు చేసిన ఉత్పత్తులను బయట విక్రయించి ఆసొమ్ము వారి బ్యాంకుల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. జైళ్లల్లో ఉన్న ఖైదీలకు సిబ్బంది సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఎమ్మెల్యే బొండా ఉమా, మేయర్ కోనేరు శ్రీ్ధర్, కార్పొరేటర్లు, జైలు సూపరింటెండెంట్ సిహెచ్ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు.